Thursday, 20 February 2020

ఓ చిన్నపిల్లని గర్భిణిని చేశాడు: మాజీ ప్రియుడిపై హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు

ప్రేమలో మోసపోతే ఎంత బాధ ఉంటుందో ప్రతీ ఒక్కరికీ అనుభవం అయివుంటుంది. ఇక సెలబ్రిటీల విషయంలో అయితే వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్ని విషయాలు బయటికి వస్తే ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ నటి విషయంలో అదే జరుగుతోంది. ఆమె ప్రియుడు మెల్విన్ లూయిస్‌ మోసం చేసాడని కొన్ని రోజులుగా మండిపడుతున్నారు. రోజూ మెల్విన్‌కు సంబంధించి ఏదో ఒక విషయం బయటపెడుతూనే ఉన్నారు. దాంతో మెల్విన్‌కి ఒళ్లు మండింది. సనా ఖాన్‌ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ఏదో ఒక కామెంట్ పెడుతున్నాడు. దాంతో సనాకు కోపం పీక్స్‌కి వెళ్లిపోయింది. అతని నుంచి నగ్నసత్యాలు ఇవేనంటూ వరసగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టింది. ‘మోసం అనేది పొరపాటున జరగదు. అంతా ప్లానింగ్‌తోనే జరుగుతుంది. చాలా రోజులుగా నేను ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అతని కోసం కాదు. అతను నన్ను పెట్టిన బాధ వల్ల. నా పరిస్థితే ఇలా ఉంటే అతను మోసం చేసిన మిగతా అమ్మాయిల జీవితాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఓ చిన్న పిల్లలను గర్భిణిని చేసి వదిలేసాడంట. ఆ విషయం తెలిసి నా గుండె పగిలిపోయింది. ఎందరో అమ్మాయిల నుంచి డబ్బులు తీసుకున్నాడు. డ్యాన్స్ టీచర్ అంటే ఇలా ప్రవర్తిస్తాడా? నాకు భయం వేస్తోంది. అల్లా మీకు తగిన గుణపాఠం చెప్తారు’’ అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు సనా. READ ALSO: ‘ఇతనంటే నాకు ప్రాణం. జీవితంలో ఇతను తోడుంటే చాలు. అంతకుమించి ఏమీ అవసరం లేదు’’.. ఏడాది క్రితం బాలీవుడ్ నటి తన ప్రియుడి గురించి వివరిస్తూ పెట్టిన కామెంట్స్ ఇవి. సరిగ్గా ఏడాది తర్వాత అతని నిజ స్వరూపం తెలిసే సరికి మోసపోయానని మీడియా ముందుకు వచ్చి కన్నీరుపెట్టుకున్నారు. దాంతో చాలా మంది ఫ్యాన్స్, సెలబ్రిటీలు సనా పట్ల జాలి చూపిస్తున్నారు. కనీసం మంచి సినిమాలు చేతిలో పడితే ఈ బాధ నుంచి కోలుకుంటారని ఆశిస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V49dvr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...