Monday, 3 February 2020

అయ్యో హీరోయిన్‌కి ఈ పరిస్థితేంటి.. సెట్స్‌లో చీపురు పట్టింది!

పాపం.. స్టార్ హీరోయిన్‌కి ఎంత కష్టం వచ్చిందో. చీపురు పట్టుకుని సెట్స్ మొత్తం శుభ్రం చేసేస్తోంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ బార్బీ డాల్ . ప్రస్తుతం కరీనా ‘సూర్యవంశీ’ సినిమాలో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయాక కత్రినా చీపురు పట్టారు. సెట్స్‌లో పడిన చెత్తా చెదారం మొత్తం శుభ్రం చేశారు. ఆ సమయంలో అక్షయ్ వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో తీస్తున్న సమయంలో అక్షయ్ కత్రినాను .. ‘అయ్యో కత్రినా మీరేం చేస్తున్నారు’ అంటూ టీజ్ చేశారు. ‘‘సూర్యవంశీ సెట్స్‌లో కొత్త స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్’’ అని కామెంట్ చేశారు. అక్షయ్, కత్రినా కలిసి చాలా సినిమాల్లో నటించారు. కత్రినా సల్మాన్ పక్కనే కాదు అక్షయ్ పక్కన కూడా చాలా బాగా సెట్ అయ్యారు. ఈ జంటకు కూడా ఫ్యాన్స్‌లో చాలా క్రేజ్ ఉంది. చాలా కాలం తర్వాత మళ్లీ ‘సూర్యవంశీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దాంతో సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇందులో అక్షయ్ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37TVTgN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...