Thursday, 20 February 2020

మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు, విడిపోతామనుకోలేదు: కరీనా కపూర్

బాలీవుడ్ బ్యూటీ , చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ ఒకప్పుడు ప్రేమించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవారు. పెళ్లి కూడా చేసేసుకుంటారు అనుకున్నారు. కానీ 2006లో వీరిద్దరూ విడిపోయి చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వారి రిలేషన్‌షిప్‌లో గొడవలు వచ్చాయి. ఆ తర్వాత కరీనా ‘టషన్’ అనే సినిమాలో సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు. అదే సమయంలో సైఫ్, కరీనా ప్రేమించుకున్నారు. విచిత్రం ఏంటంటే.. సైఫ్, కరీనా ప్రేమలో ఉన్నప్పుడు దర్శకుడు ఇంతియాజ్ అలీ ‘జబ్ వి మెట్’ సినిమా కథను షాహిద్ కపూర్‌కు వినిపించారు. షాహిద్ ఈ కథ విన్నాక ఓ సారి కరీనాకు కూడా వినిపించండి అన్నారట. కరీనా కూడా స్క్రిప్ట్ చదివారు. తన క్యారెక్టర్ బాగుండడంతో మాజీ ప్రియుడైనప్పటికీ సినిమాలో కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ సినిమాలో అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కానీ షాహిద్, కరీనాను మాత్రం ఒకటి చేయలేకపోయింది. అదే సమయంలో కరీనా, సైఫ్ ప్రేమించుకున్నారు కాబట్టి.. ఎవ్వరికీ తెలీకుండా పెళ్లి చేసేసుకున్నారు. అప్పట్లో సైఫ్, కరీనాల పెళ్లి బాలీవుడ్‌లోనే బిగ్గెస్టె ఈవెంట్‌ అట. READ ALSO: బాలీవుడ్ మీడియా వర్గాల టీఆర్‌పీలు వీరి రహస్య వివాహంతో ఊపందుకున్నాయి. అయితే షాహిద్ గురించి ఇప్పటివరకు కరీనా ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి మొదటిసారి పెదవి విప్పారు. ‘‘జబ్ వి మెట్, టషన్ సినిమా షూటింగ్‌లో నేను ఒకేసారి పాల్గొన్నాను. అయితే ఈ రెండు సినిమాలు మా ముగ్గురి జీవితాలను మార్చేసింది. నాకు చదరంగం ఆడుతున్నట్లు అనిపించింది. ‘జబ్ వి మెట్’ సినిమా నా జీవితాన్ని మార్చేస్తే ‘టషన్’ సినిమా నేను కోరుకున్న వ్యక్తిని దగ్గర చేసింది. ఇదంతా దేవుడు ఆడిన నాటకం అనే చెప్పాలి’’ అని తెలిపారు కరీనా. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39QOH5x
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...