స్టైలిష్ స్టార్ ఇండస్ట్రీకి తానేంటో నిరూపించేసుకున్నారు. మెగా, అల్లు వారసుల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్టార్‌డం సంపాదించుకున్న ఏకైక నటుడు ఆయనే. చేతనైతే చిన్న సినిమాలను బతికించాలని ఎప్పుడూ అంటుండే ఆయన చిన్న హీరో సినిమాను ఆపాలని చూస్తున్నారట. ఓ వెబ్‌సైట్ రాసిన పులిహార గాసిప్ ఇది. ఇంతకీ విషయం ఏంటంటే.. యువ నటుడు నిఖిల్ గీతా ఆర్ట్స్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ‘కుమారి 21f’ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ నిఖిల్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ కథ రాయబోతున్నారట. అల్లు అరవింద్ సినిమాను సమర్పిస్తారు. బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తారు. అయితే నిఖిల్ సినిమా ఇప్పుడిప్పుడే మొదలయ్యేలా లేదట. ఇందుకు కారణం సుకుమార్.. సూర్య ప్రతాప్‌ను బన్నీ కోసం కథ రాయమని అడగడమేనట. పెద్ద దర్శకుడు, పెద్ద హీరో సినిమాకు కథ రాయమనడంతో సూర్య ప్రతాప్ ఆ పనిలో పడి బిజీ అయిపోయారట. దాంతో అల్లు అర్జున్ కోసం నిఖిల్‌ను దూరంపెట్టారని తెలుస్తోంది. READ ALSO: దాంతో నిఖిల్ కూడా ఎక్కువ కాలం ఎదురుచూడలేక చందూ మొండేటి దర్శకత్వంలో రాబోతున్న ‘కార్తికేయ 2’ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సదరు వెబ్‌సైట్ పేర్కొంది. మరోపక్క బన్నీ, సుకుమార్ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. ఇందులో రష్మిక మందన హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ రకంగా వార్త రాసుకొస్తూ.. నిఖిల సినిమాను బన్నీ ఆపి, తన సినిమా కోసం కథ రాయించుకుంటున్నారని టాక్ అట! READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HGrCqb
v
No comments:
Post a Comment