Sunday, 23 February 2020

నయనతార మెయింటనెన్స్‌.. ‘మావల్ల కాదు’ అంటోన్న నిర్మాతలు

నయనతార ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా తమిళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు నయన్. కిందటేడాది ఏకంగా ఏడు సినిమాల్లో నటించారు. వాటిలో ‘సైరా’, ‘బిగిల్’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది రజినీకాంత్ ‘దర్బార్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఇంకా మూడు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లాయి. ఇదిలా ఉంటే, గత కొద్ది నెలలుగా తమిళనాట నయనతారపై ఒక నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. నయనతారను తట్టుకోవడం తమిళ నిర్మాతల వల్ల కావడంలేదట. అంటే, మెయింటనెన్స్ పరంగా. నయనతారకు ఇచ్చే పారితోషికంతో పాటు ఆమె మెయింటనెన్స్‌కు కూడా బాగా ఎక్కువ ఖర్చు అవుతోందట. నయనతార టీం ఐదు నుంచి ఆరుగురు ఉంటారని సమాచారం. వీరంతా ఆమెతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారట. నయనతారతో పాటు వాళ్లకు ఫ్లైట్ టిక్కెట్లు, హోటల్ రూమ్స్, సెట్స్‌లో వాళ్లకు అయ్యే ఖర్చు అంతా కలిసి తడిసి మోపెడు అవుతోందట. Also Read: కాబట్టి, ఈ విషయంలో ఇక నోరుమూసుకుని ఉండకూడదని తమిళ నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు అక్కడి మీడియా ద్వారా వచ్చిన సమాచారం. ఎలాగైనా నయనతార టీంకు చెక్ పెట్టాలని.. పారితోషికంతో పాటు అదనపు ఖర్చుల గురించి ఆమెతో అంతా కలిసి ఒకసారి మాట్లాడాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎక్కడికి బడితే అక్కడికి నయన్‌తో పాటు ఆమె టీంను అనుమతించకుండా చేయాలని చూస్తున్నారట. అత్యవసర సమయాల్లో మాత్రమే తనతో పాటు టీంను వెనుక తీసుకొచ్చే అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37OzWP9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...