Tuesday, 25 February 2020

కమల్ హాసన్ నా అనుమతి లేకుండా ముద్దుపెట్టారు: వైరల్ అవుతున్న నటి షాకింగ్ ఇంటర్వ్యూ

ప్రముఖ సీనియర్ నటి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విలక్షణ నటుడు కమల్ హాసన్‌పై చేసిన కామెంట్స్ షాక్‌కు గురిచేస్తున్నాయి. రేఖ, కమల్ హాసన్ జంటగా 1986లో ‘పున్నగాయ్ మన్నన్’ అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో కమల్, రేఖ గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆత్మహత్య చేసుకునే సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు కమల్ హాసన్ రేఖ‌కు ముద్దుపెట్టేసారట. ఈ విషయాన్ని రేఖ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘పున్నగాయ్ మన్నన్ సినిమాకు కే. బాలచందర్ దర్శకత్వం వహించారు. మేం సూసైడ్ సీన్ షూటింగ్ చేస్తుంటే ఒక్కసారిగా కమల్ హాసన్ ముద్దు పెట్టేసారు. ఆయన కావాలని చేసింది కాదు అని నాకు తెలుసు. కానీ ముద్దు సీన్ ఉందని నాకు బాలచందర్ కానీ కమల్ హాసన్ కానీ ముందే చెప్పాలి కదా. వాళ్లు చెప్పలేదు. నా అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టేయడంతో కోపం వచ్చింది. షూటింగ్ అయిపోయాక నేను బాలచందర్ గారి వద్దకు వెళ్లి ఇదే విషయం గురించి అడిగాను. అందుకు ఆయన ఏమన్నారో తెలుసా. ఈ ముద్దు సీన్‌లో తప్పేముంది? ఇద్దరి మధ్య ప్రేమ ఉందని చూపించాలంటే ముద్దు సీన్లు ఉండాల్సిందే అన్నారు" READ ALSO: "కానీ ఆ సీన్ తర్వాత నాకు కొన్ని రోజుల పాటు నిద్ర లేదు. అదో పీడకలలా నన్ను వెంటాడింది’ అని తెలిపారు. ఈ వీడియోను సంగీత్ అనే అమ్మాయి ట్విటర్‌లో షేర్ చేసారు. ‘‘ఇది అరాచకం. ఇలాంటి సంఘటన హాలీవుడ్‌లో జరిగి పెద్ద రచ్చ అయ్యేది. దీనిని కూడా లైంగిక వేధింపులనే అంటారు. కానీ షూటింగ్ సెట్‌లో ఉన్నది బాలచందర్, కమల్ హాసన్ కాబట్టి సమస్య ఉండదు’’ అని కామెంట్ చేసారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SU4pqV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...