Sunday, 16 February 2020

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం

టాలీవుడ్ ఇంట విషాదం నెలకుంది. శ్రీకాంత్‌కు తండ్రి మేక పరమేశ్వరరావు (70) ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోన్న పరమేశ్వరరావు గత నాలుగు నెలల నుంచి స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్‌ ఇంటికి చేరుకుంటున్నారు. ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పరమేశ్వరరావు 1948 మార్చి 16న కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించారు. అనంతరం వీరి కుటుంబం కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లింది. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. శ్రీకాంత్ కూడా గంగావతిలోనే జన్మించాడు. ధర్వాడ్‌లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి బీకాం డిగ్రీ పూర్తిచేసిన శ్రీకాంత్.. తర్వాత సినిమాలపై మక్కువతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లోమా చేశారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించి నెమ్మదిగా హీరోగా మారారు. సురేశ్ ప్రొడక్షన్‌‌లో వచ్చిన తాజ్‌మహల్ సినిమా శ్రీకాంత్ కెరీర్‌ను మలుపుతిప్పింది. తర్వాత రాఘవేంద్రరావు పెళ్లిసందడి ఆయనను కథానాయకుడిగా మరో మెట్టుకు తీసుకెళ్లింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Hsid5l
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...