Monday, 17 February 2020

‘భీష్మ’ క్లీన్ ‘యు’ సినిమా.. క్రిస్ప్ రన్‌టైమ్

యంగ్ హీరో నితిన్, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈనెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలను సోమవారం పూర్తి చేశారు. సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాదు, సెన్సార్ బోర్డ్ సభ్యులు ఎలాంటి కట్స్ చెప్పలేదట. వెంకీ కుడుముల అంత క్లీన్ అండ్ నీట్‌గా ఈ సినిమాను తెరకెక్కించారని అంటున్నారు. సినిమా రన్ టైమ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. 2.20 గంటల నిడివితో ‘భీష్మ’ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందించనున్నాడు. నితిన్ ఎనర్జీ, రష్మిక మందన గ్లామర్, కామెడీ.. ఇంకా వీళ్లద్దరి మధ్య కెమిస్ట్రీ ‘భీష్మ’లో హైలైట్‌గా ఉండనున్నాయట. నితిన్, రష్మిక తొలిసారి కలిసి నటించడంతో తెర మీద ఈ జంట చాలా ఫ్రెష్‌గా కనిపించిందని అంటున్నారు. ఈ చిత్ర యూనిట్‌కు సన్నిహితంగా ఉన్న కొంత మంది చెప్పిన వివరాల ప్రకారం ఈ సినిమాలో కామెడీకి పెద్ద పీట వేశారట. ఈ విషయం ట్రైలర్‌ చూస్తుంటేనే అర్థమైపోతోంది. అయితే, ట్రైలర్‌లో చూపించింది కేవలం శాంపిల్ మాత్రమే అంటున్నారు. థియేటర్‌లో పొట్టలు చెక్కలవ్వడం ఖాయం అని చెబుతున్నారు. సెన్సార్ బోర్డు సభ్యులు కూడా కామెడీనీ ఫుల్‌గా ఎంజాయ్ చేశారట. Also Read: ఇక ఈ సినిమాకు సంగీతం కూడా మరో బలం కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వారసుడైన మహతి స్వర సాగర్ మధురమైన పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతం అందించారట. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయని సమాచారం. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. కాబట్టి, ఇన్ని మంచి క్వాలిటీస్‌తో వస్తోన్న ‘భీష్మ’ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తాడని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమాకు పోటీ ప్రస్తుతం మరే సినిమా లేదు. కాబట్టి, హిట్ టాక్ వచ్చిందంటే బాక్సాఫీసు వద్ద కాసుల వర్షమే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P2euQm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...