Tuesday, 11 February 2020

రానాను గెలికిన నెటిజన్.. దగ్గుబాటి వారసుడు ఊరుకుంటాడా!

చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో నెపోటిజం (బంధుప్రీతి) విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అటు బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఆ ఇష్యూ ఉంది. కానీ బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ అంశంపై స్పందించినంతగా టాలీవుడ్ వాళ్లు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే టాలీవుడ్ మొత్తాన్ని నడిపిస్తోంది స్టార్ కిడ్సే. దాదాపుగా హీరోలంతా ఒకప్పటి సినిమా స్టార్ల బిడ్డలే. వారిలో కూడా ఉన్నారు. రానా బాబాయ్ విక్టరీ వెంకటేష్. ఆయనను చూసే రానా సినిమాల్లోకి రావాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ నెపోటిజం చర్చ ఎందుకొచ్చిందంటే... నిన్న రానా తాను నటించిన ‘అరణ్య’ సినిమా ఫస్ట్‌లుక్స్‌ను రిలీజ్ చేసారు. ఫ్యాన్స్ అంతా కంగ్రాట్స్ చెప్తుంటే ఓ నెటిజన్ మాత్రం రానాను గెలికాడు. అప్పుడెప్పుడో రానా ఇచ్చిన ఇంటర్వ్యూని పోస్ట్ చేస్తూ కామెంట్ చేసాడు. ఆ ఇంటర్వ్యూలో రానా ఓ మాటన్నారు. ‘నేను పదో తరగతి ఫెయిల్ అయ్యాను. కానీ ఆ ఫలితాలు నా కలలు నెరవేర్చుకోకుండా ఆపలేకపోయాయి’ అన్నారు. దీనికి సదరు నెటిజన్ కౌంటర్ వేసాడు. ‘ఎందుకంటే నా కుటుంబానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఉంది’ అన్నాడు. దాంతో రానాకు మండింది. గెట్టిగానే వేసుకునేవాడు కానీ ఎందుకొచ్చిన గొడవలే అని సర్దిచెప్పడానికి యత్నించాడు. ‘అందులో ఏమీ లేదు బ్రో. మనం నటన అనే ఆర్ట్‌ని నేర్చుకోకపోతే వెనక ఎంత పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా వేస్టే. READ ALSO: ఇండియాలో చాలా స్టూడియోస్ ఉన్నాయి. కానీ ఏం లాభం. టాలెంట్ లేక కూరుకుపోతున్నాయి. నిన్ను ప్రపంచమంతా ఫెయిల్యూర్ అని ఎగతాళి చేసినా కూడా నీ కలలు సాకారం చేసుకోగలగాలి’ అని క్లాస్ పీకారు. రానా ఇచ్చిన ఆన్సర్‌కు ఆ నెటిజన్ ఏమీ మాట్లాడలేక నోరుమూసుకున్నాడు. దాంతో ఫ్యాన్స్ అంతా రానాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31KaglF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...