Saturday, 15 February 2020

పులితో ఫైట్.. రిస్క్ చేస్తోన్న ఎన్టీఆర్!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న భారీ మల్టీస్టారర్ మూవీ RRRలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక విషయం రోజూ బయటికి వస్తూనే ఉంది. అయితే, తాజాగా ఇండస్ట్రీలో ఒక రూమర్ వినిపిస్తోంది. అది ఏంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తారట. పులితో ఫైట్ అంటే ‘మన్యం పులి’లో మాదిరిగా గ్రాఫిక్స్ కాదట.. నిజం పులితోనే ఎన్టీఆర్ ఫైట్ చేస్తారని అంటున్నారు. దీనికోసం ఇప్పటికే ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నారని అంటున్నారు. ప్రొఫెషనల్ ట్రైనర్ సారథ్యంలో నిజం పులితో ఎలా ఫైట్ చేయాలో ఎన్టీఆర్ నేర్చుకున్నారట. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ఇలా నిజం పులితో ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఇంత రిస్క్ చేయడం అవసరమా అని ప్రశ్నించేవాళ్లు కూడా ఉన్నారు. కానీ, ఈ పులితో ఫైట్ సీన్‌‌తో కొమరం భీమ్ పరిచయం ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు, ఇటు రామ్ చరణ్ అభిమానులతో పాటు.. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిత్ర అప్‌డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. చిత్ర విడుదల తేదీని మారుస్తూ ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 8న RRRను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేక్షకులకు మంచి క్వాలిటీతో కూడిన సినిమాను అందించడానికి తాము సమయం తీసుకుంటున్నట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అయితే, అప్పటి వరకు సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ ఇస్తూ ఉంటామని వెల్లడించింది. మరి త్వరలో ఏ అప్‌డేట్‌తో వస్తారో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bPkmpY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...