Thursday, 20 February 2020

అమ్మ కోసం బంగారు పాదాలు చేయించిన నరేష్

దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడు అని మన పెద్దలు చెబుతుంటారు. మనకు తొలి నేస్తం అమ్మ. మనం మొదట పట్టుకున్న అమ్మదే. మనం పొందే తొలి ప్రేమ అమ్మ నుంచే. మనం బాల్యంలో ‘మొదటి’ది అని చెప్పుకునే ఏ సంగతైనా అది అమ్మకు సంబంధించే అయ్యుంటుంది. మనం పెరుగుతూ పెద్దవుతున్నా అమ్మకు మాత్రం ఇంకా చిన్నపిల్లాడిలానే కనిపిస్తాం. అందుకే, మనం బిడ్డలకు తండ్రులమైనా బయటికి వెళ్లేటప్పుడు తన బిడ్డకు అమ్మ ‘క్షేమంగా వెళ్లిరా నాన్న’ అని జాగ్రత్త చెబుతుంది. మరి అలాంటి అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. అందుకే, తన నుంచి దూరమైన తన తల్లికి బంగారు పాదాలు చేయించి వాటిలో తన తల్లిని చూసుకుని పూజిస్తున్నారు ప్రముఖ నటుడు వీకే నరేష్. See Photos: ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్రహీత విజయనిర్మలకు నరేష్ కుమారుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. నరేష్ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక తన తల్లి విజయనిర్మల ప్రోత్సాహం ఎంతో ఉంది. తాను ఎంతగానో ప్రేమించే అమ్మను కిందటేడాది ఆయన కోల్పోయారు. సినీలోకానికి తీరని శోకాన్ని మిగిల్చి విజయనిర్మల వెళ్లిపోయారు. అయితే, గురువారం (ఫిబ్రవరి 20న) విజయనిర్మల 74వ జయంతి. ఈ సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని భర్త సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. Also Read: నానక్‌రామ్‌గూడాలోని సూప‌ర్ స్టార్‌ కృష్ణ, విజయనిర్మల నివాసంలో ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాంస్య విగ్రహంతో పాటు నరేష్ చేయించిన విజయనిర్మల బంగారు పాదాలను కూడా ఆవిష్కరించారు. ఈ పాదాలను తల్లి విగ్రహం వద్దే అద్దాల పెట్టెలో ఉంచారు. ఈ బంగారు పాదాల గురించి కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రస్తావించారు. ‘‘ప్రతి ఒక్కరికి తల్లితండ్రులు అంటే అభిమానం ఉంటుంది. అలా నరేష్ తన తల్లికి బంగారు పాదాలు చేయించి పూజించడం గొప్ప విషయం’’ అని కృష్ణంరాజు అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2v4TyRZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...