Sunday, 9 February 2020

Biggest super Star Poll: వెనకబడిన తారక్.. దూసుకెళ్తున్న మహేష్

సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫ్యా్న్స్ మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ అనే కాదు అటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ అంతే. సినిమా ఇండస్ట్రీలోని వారంతా ఏకతాటిపై ఉంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రం కొట్టుకు చస్తుంటారు. తాజాగా తెలుగు చిత్రపరిశ్రమలో బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ ఎవరు అనే పోల్ ఒకటి ట్విటర్‌లో పెట్టారు. సౌత్ ఇండియన్ పోల్స్ అనే పేజ్ ఈ పోల్‌ను నిర్వహించింది. సూపర్‌స్టార్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఈ పోల్ పెట్టారు. ఇప్పటివరకు తారక్ కంటే మహేష్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. తారక్‌కు కేవలం 49 శాతం ఓట్లు రాగా.. మహేష్‌కు 53 శాతం ఓట్లు వచ్చాయి. దాంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. మహేష్‌పై నోటికొచ్చిన కామెంట్స్ పెడుతూ ఎన్టీఆరే అసలైన సూపర్‌స్టార్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ పోల్ ఎందుకు పెట్టారంటే.. మరో వంద రోజుల్లో తారక్ బర్త్‌డే రాబోతోంది. అందుకని ఈ పోల్ క్రియేట్ చేసారు. నిజానికి ఇలాంటి పోల్స్ పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే... ఏ హీరో గొప్పతనం ఆ హీరోకు ఉంటుంది. అంతేకానీ ఓ హీరోను తక్కువ చేసి మరో హీరో గొప్ప అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇలాంటి పోల్స్ పెట్టడం వల్ల ఫ్యాన్స్ కొట్టుకుంటారు. READ ALSO: ఒకవేళ మాట మాట పెరిగి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు. ఏడాది క్రితం ఇలాంటి గొడవ వల్ల ఓ యువకుడు బలైపోయాడు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఎన్టీఆర్ అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో ఎన్టీఆర్ అభిమాని పవన్ అభిమానిని పొడిచేసాడు. దాంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ తర్వాత పవన్ బాధితుడి ఇంటికి వెళ్లి సంతాపం వ్యక్తం చేసారు. వారి కుటుంబానికి ఆర్థికంగానూ సాయం చేసారు. కాబట్టి ఇలాంటి పోల్స్ పెట్టకపోవడమే మంచిదన్న విషయం ఫ్యాన్స్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. See Photo Story:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SxGRXs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...