Tuesday, 11 February 2020

Bigg Boss: ఆ నటి నెలకొకరిని మార్చే టైపు: మితిమీరుతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రవర్తన

బాలీవుడ్ సూపర్‌స్టా్ర్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో సీజన్ 13లో ఆడవాళ్లపై అసభ్యకరమైన కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్ సిద్ధార్థ్ శుక్లా.. నటి రష్మీ దేశాయ్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. దాంతో నెటిజన్లు ఆయన ప్రవర్తనపై కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్ షో స్టార్ట్ అయిన కొత్తలో రష్మీ, సిద్ధార్థ్ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత బద్ధ శత్రువుల్లా తయారయ్యారు. అసలు రష్మీతో ఎందుకు గొడవ వచ్చిందో సిద్ధార్థ్ వెల్లడిస్తూ ఆమె క్యారెక్టర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసాడు. ‘‘రష్మీతో నేను ఎందుకు గొడవపడుతున్నానని చాలా మంది అడుగుతున్నారు. నేను ఇప్పుడే దీని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒకప్పుడు నేను రష్మీని చాలా ఇష్టపడ్డ మాట నిజమే. కానీ నేను సెట్స్‌లో ఇతర నటీనటులతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడినని నా గురించి కొన్ని పత్రికలు రాసాయి. అవన్నీ రష్మీకి ఉన్న సమస్యలు. రష్మీనే ఈ సమస్యలన్నింటికీ కారణం అని నాకు ప్రొడక్షన్ బాయ్స్ చెప్పారు. అదీకాకుండా రష్మీ నెలకొకరిని మార్చే టైపు’’ అన్నాడు. దాంతో రష్మీకి కోపం వచ్చి సమయం వచ్చినప్పుడు నేను కూడా నీ గురించి బయటపెడతానని హెచ్చరించింది. READ ALSO: రియాల్టీ షో అంటే ఒకరినొకరు తిట్టుకోవడం, అవసరమైతే చొక్కాలు పట్టుకోవడం అనుకుంటున్నారు. అఫ్‌కోర్స్..బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా చెబితే అలా చేయాలి. కానీ అందరి ముందు ఓ నటి గురించి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అని నెటిజన్లు అంటున్నారు. ఒకప్పుడు రష్మీని ఇష్టపడిన సిద్ధార్థ్.. ఈరోజు ఆమెతో గొడవ అయ్యేసరికి నెలకు ఒకరిని మార్చే టైపు అనడం ఎంత వరకు కరెక్ట్‌ని ప్రశ్ని్స్తున్నారు. ఓ ఆడదాని క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారు అని మండిపడుతున్నారు. ఇవన్నీ చూస్తూ, వింటూ మౌనంగా ఉంటున్న సల్మాన్ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Hf4hvJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...