Wednesday, 5 February 2020

ఊహించని షాక్ ఇచ్చిన రాజమౌళి.. 2021లో RRR విడుదల

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం RRR విడుదల వాయిదా పడుతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కూడా RRR వాయిదా పడుతున్నట్టు పరోక్షంగా వెల్లడించారు. దీంతో సినిమా వాయిదాపై అందరికీ క్లారిటీ వచ్చింది. మహా అయితే రెండు మూడు నెలలు వాయిదా పడుతుందేమో అనుకున్నారు. కానీ, ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు రాజమౌళి. సినిమా విడుదలను ఏకంగా 2021కి వాయిదా వేసేశారు. 2021 జనవరి 8న సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. RRR విడుదల తేదీని వాయిదా వేసినట్టు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. అత్యుత్తమమైన ఔట్‌పుట్ ఇవ్వడం కోసమే ఎక్కవ సమయం తీసుకుంటున్నట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ‘‘మీరు అందిస్తోన్న ప్రేమ, ప్రోత్సాహంతో మేం ఎంతో కష్టపడుతున్నాం, నిరంతరాయంగా షూటింగ్ చేస్తున్నాం. ఇంతకు ముందు ఎన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను మీకు అందించడానికి 24 గంటలూ పనిచేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. మీ నిరుత్సాహాన్ని మేం అర్థం చేసుకోగలం. కానీ, మేం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మీకు మంచి సినిమాను అందించడానికి మాకు కావాల్సింది కేవలం సమయం మాత్రమే’’ అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3764VWU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...