Sunday, 16 February 2020

బిగ్‌బాస్ 13 విన్నర్ ఇతనే.. నోటికొచ్చినట్లు తిడుతున్న నెటిజన్స్

సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ 13వ సీజన్ విన్నర్‌గా ప్రముఖ బుల్లితెర నటుడు నిలిచారు. నిన్న జరిగిన ఫినాలే ఎపిసోడ్‌లో షోను హోస్ట్ చేస్తున్న సల్మాన్.. సిద్ధార్థ్‌ను విజేతగా ప్రకటించారు. అయితే ఈ షో విజేతగా సిద్ధార్థ్ శుక్లానే నిలుస్తాడని ఆడియన్సే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా గెస్ చేసారు. ఎందుకంటే.. సిద్ధార్థ్ పట్ల సల్మాన్ పక్షపాతం చూపించాడని, అతన్నే నెగ్గించాలని మిగతావారిపై లేనిపోని నిందలు వేసారని చాలా మంది ఆరోపించారు. అంతేకాదు సిద్దార్థ్‌ను విన్నర్‌గా ప్రకటించడంపై చాలా మంది సెలబ్రిటీలు, ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ ట్రోఫీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్ధార్థ్‌ను సపోర్ట్ చేసేవారి కంటే తిట్టేవారే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే సిద్ధార్థ్‌కి మొదటి కోపం, ఆవేశం ఎక్కువ. తోటి లేడీ కంటెస్టెంట్స్‌ను నోటికొచ్చినట్లు తిట్టేవారు. అనకూడని మాటలు అనేసి, నాకు చిరాకుగా ఉంది అందుకే అలా మాట్లాడాను అనేవాడు. తెలుగు, హిందీలో మంచి టీఆర్పీలు సాధించిన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌లో సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించారు. READ ALSO: సిద్ధార్థ్ షూటింగ్ సెట్స్‌లో ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని చాలా మంది ఆరోపించారు. దాంతో సిద్ధార్థ్ షో నుంచి వెళ్లిపోతాడని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనే విన్నర్‌గా నిలిచి అందరినీ షాక్‌కు గురిచేసారు. టైటిల్ గెలిచాక సిద్ధార్థ్ మీడియాతో మాట్లాడారు. ‘నాపై వస్తున్న ఆరోపణల గురించి నేనేం మాట్లాడగలను. ఘోరమైన ప్రయాణం తర్వాత ఈ టైటిల్ అందుకున్నాను. నా గురించి అడిగే ప్రతీ ప్రశ్నకు నేను సమాధానాలు చెప్పలేను కదా’ అని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2u6ioAu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...