Thursday, 23 January 2020

NTR: అప్పుడే త్రివిక్రమ్‌తోనా.. ‘ఆర్ ఆర్ ఆర్’ అవ్వకుండానే!

యంగ్ టైగర్ క్షణం తీరికలేకుండా షూటింగ్‌లతో బిజీ అయిపోయారు. ఈ మధ్యకాలంలో ఆయన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి కాస్త బ్రేక్ కూడా తీసుకోలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఒకటి టాలీవుడ్ నుంచి వినిపిస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత తారక్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నారట. అంతేకాదు వేసవిలోనే షూటింగ్ మొదలుపెట్టేయాలని అనుకున్నారట. అప్పటికి ఇంకా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఫూర్తిగా అయిపోయే అవకాశాలు లేవని తెలుస్తోంది. దాంతో ఓ పక్క ‘ఆర్ ఆర్ ఆర్’తో మరోపక్క త్రివిక్రమ్ సినిమాతో తారక్ మరింత బిజీ అయిపోతారట. వేసవి నుంచి షూటింగ్ మొదలుపెడితేనే 2021 సంక్రాంతికి విడుదల చేయొచ్చని త్రివిక్రమ్ అనుకున్నారట. అదీకాకుండా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా గతేడాది వేసవిలోనే ప్రారంభం అయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టేసింది. READ ALSO: ఇదే ఫార్ములాను ఎన్టీఆర్ సినిమాకు కూడా అప్లై చేయాలని గురూజీ అనుకుంటున్నారట. త్వరలో ఈ విషయానికి సంబంధించి అప్‌‌డేట్ కూడా వస్తుందని ఫిలిం వర్గాల సమాచారం. బహుశా తారక్ త్రివిక్రమ్ సినిమా తొలి షెడ్యూల్ పూర్తిచేసేసి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారేమో. తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా మంచి విజయం అందుకుంది. అందుకే మళ్లీ త్రివిక్రమ్‌కే మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NTq3sp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...