Sunday, 19 January 2020

NBK 106: గుండుతో బాలయ్య.. వైరల్ అవుతోన్న లుక్

నటసింహా నందమూరి బాలకృష్ణ ఏ పాత్ర చేసినా అందులో లీనమైపోతారు. ఆ పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తన లుక్‌ను రకరకాలుగా మారుస్తుంటారు. ఇటీవల ‘రూలర్’ సినిమాలో ఐరన్ మ్యాన్ లుక్‌తో ఆకట్టుకున్నారు. స్టైలిష్‌గా కనిపించారు. అయితే, ఇప్పుడు మరో కొత్త లుక్‌తో బాలయ్య అభిమానులను కట్టిపడేస్తున్నారు. ఇది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కోసమేనని అంటున్నారు. వైట్ అండ్ వైట్ ఖద్దరు దుస్తుల్లో గుండు, గుబురు మీసాలతో బాలయ్య లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రకరకాల పాత్ర కోసం రకరకాల విగ్‌లు వాడే బాలయ్య విగ్ లేకుండా కూడా మాస్ లుక్‌తో అదరగొడుతున్నారని ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. బాలయ్య విషయంలో బోయపాటి మరోసారి తన మార్క్‌ను చూపించారని అంటున్నారు. Also Read: రేపటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని టీడీపీ విప్ జారీ చేసింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు బాలయ్య ఇప్పటికే విజయవాడ వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఫొటో అక్కడ తీసుకున్నదేనని తెలిసింది. ఈ లుక్ నిజంగా బోయపాటి సినిమా కోసమే అయితే బాలయ్య ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. నిజానికి పాత్ర కోసం గుండు చేయించుకున్న స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో లేరు. ఈ సినిమా కోసం ఇప్పటికే బాలకృష్ణ 15 కేజీల బరువు తగ్గారు. బాలయ్య బరువు తగ్గడం ‘రూలర్’ సినిమాలోనూ కనిపించింది. ఒక సినిమా కోసం బాలకృష్ణ ఇంత కష్టపడుతున్నారంటే స్క్రిప్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గత రెండు చిత్రాల్లో బాలయ్యను పవర్‌ఫుల్‌గా చూపించిన బోయపాటి.. ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి పెరుగిపోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sDDc1n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...