Sunday, 19 January 2020

కేరళలో రానా బిజీ బిజీ.. చాలా కాలం తరవాత!

హీరో రానా దగ్గుబాటి కేరళ వెళ్లారు. అక్కడ షూటింగ్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘విరాటపర్వం’. చాలా రోజుల తర్వాత ఆయన ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం కేరళలో ప్రధాన తారాగణంపై కొన్ని ప్రధాన సన్నివేశాల్ని దర్శకుడు వేణు ఊడుగుల చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సాయిపల్లవితో పాటు, ఒక కీలక పాత్ర పోషిస్తోన్న ప్రియమణి సైతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్డ్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ కీలక పాత్రధారులైన ఈ సినిమాకు డాని సాంచెజ్-లోపెజ్ ఛాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు. 2020 వేసవిలో ‘విరాటపర్వం’ను విడుదల చేయాలని చూస్తున్నారు. Also Read: ఇదిలా ఉంటే, రానా సోలో హీరోగా సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రంలో విలన్‌గా నటించిన తరవాత 2017లో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్లీ హీరోగా కనిపించారు రానా. ఆ సినిమా తరవాత ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు పాత్రలో మెరిశారు. అనంతరం ఏ తెలుగు సినిమాలోనూ ఆయన కనిపించలేదు. రెండున్నరేళ్ల విరామం తరవాత మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TyATrA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...