Sunday, 12 January 2020

అనుష్క చేసిన తప్పే చేస్తున్న Mahesh Babu హీరోయిన్‌

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్‌ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్‌ . తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నా తరువాత ఈ అమ్మడి టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన దోచేయ్ సినిమాలో నటించిన అది సక్సెస్‌ కావటంతో టాలీవుడ్‌కు పూర్తిగా దూరమైంది ఈ బ్యూటీ. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినా బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీగా ఉంది. యంగ్ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఈ భామ త్వరలో ఓ రిస్క్‌ తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఓ బాలీవుడ్‌ మూవీ కోసం భారీగా బరువు పెరిగేందుకు నిర్ణయించుకుంది కృతి. అంతేకాదు ఇప్పటికే బరువు పెరిగేందుకు కసరత్తులు కూడా మొదలు పెట్టింది. Also Read: లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిమి అనే సినిమా కోసం ఈ రిస్క్‌ చేస్తుంది కృతిసనన్‌. సమ్రుద్ది దర్శకత్వంలో తెరకెక్కిన మాలా ఐ వైచ్యా అనే ఫీచర్‌ ఫిలిం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2011లో రూపొందించిన ఈ ఫీచర్‌ ఫిలిం ఎన్నో అవార్డులు రివార్డులతో పాటు జాతీయ అవార్డును సైతం సాధించింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న కృతిసనన్‌ తన మనసుకు ఎంతో నచ్చిన పాత్ర కావటంతో రిస్క్‌ చేసేందుకు రెడీ అవుతున్నానని తెలిపింది. అంతేకాదు `బరువు పెరగటం నా శరీరానికి చాలా కొత్త అందుకోసం శరీరాన్ని అలవాటు చేస్తున్నాను. అందుకు తగ్గ డైట్‌ ఫాలో అవుతున్నాను. తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగటం కూడా ఓ ఛాలెంజే` అంటుంది కృతి. Also Read: అయితే గతంలో సైజ్‌ జీరో సినిమా కోసం స్వీటీ అనుష్క కూడా ఇలాంటి రిస్కే చేసింది. ఆ సినిమాలో బొద్దుగా కనిపించేందుకు భారీగా బరువు పెరిగిన అనుష్క తరువాత బరువు తగ్గేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటికే అనుష్క లుక్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. మరి కృతి అయినా వెంటనే బరువు తగ్గుతుందో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FGVnWP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...