Sunday, 5 January 2020

LIVE: ‘సరిలేరు నీకెవ్వరు’ మెగా సూపర్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ మెగాస్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. లేడీ అమితాబ్‌గా పేరుగాంచిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి 13 ఏళ్ల తరవాత ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, అజయ్, సంగీత ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేందుకు, మహేష్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు ఆదివారం ‘సరిలేరు నీకెవ్వరు’ మెగా సూపర్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తోన్న ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. Also Read: ఎల్బీ స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్యాన్స్ స్టేడియంలోకి అడుగుపెట్టారు. గ్యాలరీలు అభిమానులతో నిండిపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతో మెగా అభిమానులు కూడా ఈ ఈవెంట్‌కు భారీగా తరలివచ్చారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5.04 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39CHxTc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...