Sunday, 5 January 2020

మెగా సూపర్ ఈవెంట్‌: ప్రత్యేక ఆకర్షణగా చిరు, మహేష్ భారీ కటౌట్లు

మెగా సూపర్ ఈవెంట్‌గా పిలుస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జోరు మొదలైపోతుంది. ఇప్పటికే స్టేడియం బయట అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు. గేట్లు తెరిచిన వెంటనే లోపలికి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతో మహేష్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. స్టేడియంలో ఏర్పాటుచేసిన చిరంజీవి, మహేష్ బాబు భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిరంజీవి కటౌట్ హుందగా ఉండగా.. మహేష్ బాబు కటౌట్ స్టైలిష్‌గా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను రెట్టింపు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవిని చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా తీసుకొస్తున్నారు. మరి ఈ వేడుకలో ఆయన ఏం మాట్లాడతారు.. మహేష్ గురించి ఏం చెబుతారు అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. చిరంజీవి, మహేష్ బాబు ఒకరినొకరు ఇప్పటికే చాలా సార్లు ప్రశంసించుకున్నారు. ఇటీవల జరిగిన సినీమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు.. చిరంజీవి పక్కన కూర్చోవడం తన అదృష్టమని అన్నారు. ‘సైరా’ సినిమా కోసం సగటు ప్రేక్షకుడి మాదిరిగా తానూ ఎదురుచూస్తున్నానని అన్నారు. మహేష్ బాబును ఉద్దేశించి కూడా చిరంజీవి ఈ వేడుకలో మాట్లాడారు. అయితే, మహేష్ బాబు సినిమా ఈవెంట్‌కు మెగాస్టార్ రావడం ఇదే తొలిసారి. కాబట్టి, సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QpfA9N
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...