Wednesday, 8 January 2020

విలన్‌కు ప్రేమతో.. ఖరీదైన కారు కొనిచ్చిన సల్మాన్

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూనే ఇతర భాషల్లో విలన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుతున్న నటుడు . ఈగ సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఈ వర్సటైల్‌ యాక్టర్‌, తాజాగా ఓ బాలీవుడ్ సినిమాల ప్రతినాయక పాత్రలో నటించాడు. బాలీవుడ్ కండల వీరుడు హీరోగా తెరకెక్కిన దబాంగ్‌ 3లో విలన్‌గా నటించాడు సుధీప్‌. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత డిసెంబర్‌లో రిలీజ్‌ అయి విజయం సాధించింది. చుల్‌పాండే పాత్రలో సల్మాన్ మరోసారి మ్యాజిక్‌ చేయగా విలన్‌గా సుధీప్‌ సూపర్బ్ అనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన సుధీప్‌కు తనదైన స్టైల్‌లో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు సల్మాన్‌. Also Read: తనకు నచ్చిన వారికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఇవ్వడం సల్మాన్‌కు అలవాటు. తనతో కలిసి నటించిన హీరోయిన్లకు, సాంకేతిక నిపుణులకు ఖరీదైన బహుమతులు ఇస్తుంటాడు సల్మాన్‌. తాజాగా తన విలన్‌ సుధీప్‌కు కూడా ఓ కాస్ట్లీ గిఫ్ట్‌ను అందించాడు. దాదాపు కోటిన్నర ఖరీదు చేసే బీఎండబ్ల్యూ కారును సుధీప్‌కు బహుమతిగా అందించాడు. Also Read: అంతేకాదు ఈ కారు స్వయంగా సల్మానే, సుధీప్‌ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వటం విశేషం. సల్మాన్‌ తనపై చూపించిన ప్రేమకు పొంగిపోయిన సుధీప్‌ ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. `మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది` సల్మాన్‌ సార్‌ ఈ గిఫ్ట్‌తో ఈ సూత్రాన్ని మరింతకాలం నమ్మేలా చేశారు. బీఎండబ్ల్యూ ఎం5, స్వీట్‌ గెస్చర్‌. నా మీద నా కుటుంబం మీద చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞడ్ని సార్. మీరు ఇలా మా దగ్గరకి రావటం, మీతో నేను కలిసి నటించటం నాకెంతో గర్వంగా ఉంది` అంటూ ట్వీట్‌ చేశాడు సుధీప్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T5ukMQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...