Wednesday, 8 January 2020

‘సరిలేరు నీకెవ్వరు’ మేకింగ్ వీడియో.. పొట్టచెక్కలైపోవాల్సిందే

సినిమాలకంటే షూటింగ్స్ చాలా సరదాగా ఉంటాయి. మనం సినిమాలో చూసేదంతా నటనేనని అందరికీ తెలుసు. కానీ షూటింగ్ అలా కాదు. ఎంత సీరియస్ సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడైనా డైరెక్టర్ కట్ చెప్పాక తెగ నవ్వేసుకుంటూ ఉంటారు. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ‘వైబ్ ఆఫ్ సరిలేరు నీకెవ్వరు’ అంటూ మేకింగ్ వీడియోను ట్విటర్ వేదికగా విడుదల చేశారు. షూటింగ్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ పడి పడి నవ్వుకున్నారు. అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసింది మాత్రం మహేష్. ట్రైన్‌లో మహేష్, రష్మిక మందన, సంగీతల మధ్య వచ్చే సన్నివేశంలో సంగీత గట్టిగా అరుస్తుంది. ఆ సమయంలో పైన వేసిన సెట్ ఒకటి కిందపడిపోయింది. దాంతో మహేష్‌తో పాటు అక్కడున్నవారంతా పగలబడి నవ్వుకున్నారు. అనిల్ రావిపూడి కట్ చెప్పాక ఎంతగా నవ్వుకున్నారో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. కాకపోతే ఇందులో విజయశాంతి పాత్రకు సంబంధించిన ఎలాంటి క్లిప్పింగ్స్ చూపించలేదు. ఆమెను డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి వీడియోను కూడా తీయలేదు. దీనిని బట్టే అర్థమవుతోంది ఇందులో విజయశాంతిది ఎంత కీలకమైన పాత్రో. READ ALSO: షూటింగ్‌లోనే వీళ్లంతా ఇంతగా నవ్వుకున్నారంటే ఇక థియేటర్‌లో ప్రేక్షకులను ఇంకెంత నవ్విస్తారో అర్థమైపోతోంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి వేడుకను మరింత స్పెషల్‌గా మార్చారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందన్న నమ్మకం తనలో బలంగా ఉందని ఇప్పటికే అనిల్ రావిపూడి చాలా సార్లు స్పష్టం చేశారు. సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మిల్కీ బ్యూటీ తమన్నా ‘డాంగ్ డాంగ్’ అనే స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FwKQNV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...