Friday, 24 January 2020

ఐదేళ్ల నాటి కేసు.. రజనీ సినిమా టీంకు ఊరట

సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా . కమర్షియల్‌గా పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోయినా కథా కథనాల పరంగా ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ సినిమా కథ కాపీ అంటూ రవి రత్నం అనే డైరెక్టర్‌ మధురై కోర్టులో కేసు వేశారు. లింగా కథను తన సినిమా ముల్లై వానమ్‌ 999 నుంచి కాపీ చేశారంటూ ఆరోపించాడు రవి రత్నం. ఈ కేసు కారణంగా లింగా సినిమా రిలీజ్ విషయంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు పది కోట్ల రూపాయల పూచీకత్తుతో సినిమా రిలీజ్‌కు అనుమతించింది కోర్టు. Also Read: ఐదేళ్లుగా కోర్టులో నలుగుతున్న ఈ కేసుపై తీర్పు వెలువరించింది న్యాయస్థానం. లింగా కథ కాపీ కాదంటూ తేల్చి చెప్పింది. దీంతో చిత్ర నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌కు ఊరట లభించినట్టైంది. తమిళనాట స్టార్ హీరోల సినిమాలపై ఈ కాపీ ఆరోపణలు కామన్‌ అయిపోయాయి. ముఖ్యంగా రజనీ, విజయ్‌ల సినిమాల విషయంలో ఈ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల దర్బార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అదే జోష్‌లో శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రజనీ. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36pm6C8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...