Saturday, 11 January 2020

ట్రెండింగ్ ఇన్ ఇండియా.. మొదటి మూడు స్థానాల్లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ మేనియా నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా దాదాపుగా సినిమాను చూసేశారు. చాలా రోజుల తరవాత వెండితెరపై ఆ పాత మహేష్ బాబును చూశామని అభిమానులు సంబరపడిపోతున్నారు. తొలిరోజే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది ‘సరిలేరు నీకెవ్వరు’. ఇక ట్విట్టర్‌లో అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ మోత మోగిపోతోంది. ట్విట్టర్‌లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్‌లో మొదటి మూడు స్థానాలను ‘సరిలేరు నీకెవ్వరు’ ఆక్రమించింది. #SarileruNeekkevvaru హ్యాష్ ట్యాగ్ టాప్ 1 ట్రెండింగ్‌లో ఉంది. ఇక #BlockBusterSarileruNeekevvaru రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తరవాత #MindBlock హ్యాష్ ట్యాగ్ టాప్ 3 ట్రెండింగ్. #AVPLFromTomorrow టాప్ 5 ట్రెండింగ్‌లో ఉంది. ఇండియా వైడ్ ట్విట్టర్‌లో టాప్ 5 ట్రెండింగ్ టాపిక్స్‌లో నాలుగు టాలీవుడ్‌కి చెందినవి కావడం మరో విశేషం. మధ్యలో నాలుగో స్థానంలో #DeepikaPRBackfires హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ ట్రెండింగ్ టాపిక్స్ నిమిషం నిమిషానికి మారిపోతూ ఉంటాయి. కాకపోతే, ఒక దశలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు సంబంధించి మూడు హ్యాష్ ట్యాగ్స్ టాప్ 3 స్థానాలను ఆక్రమించడం విశేషం. ఇక సినిమా విషయానికి వస్తే.. థియేటర్లలో బొమ్మ దద్దరిళ్లిపోతోంది. ఇది ‘బ్లాక్ బస్టర్ కా బాప్’ అంటూ చిత్ర యూనిట్ ప్రచారం చేస్తోంది. తొలిరోజు కలెక్షన్లు కూడా ఇదే రేంజ్‌లో ఉన్నాయి. యూఎస్‌లోనూ ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు 292 లొకేషన్లలో ప్రీమియర్ షోల గ్రాస్ 760,000 డాలర్లుగా ఉంది. అంటే, మన కరెన్సీ ప్రకారం రూ.5.39 కోట్లు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ షోలు పడ్డాయి కాబట్టి తొలిరోజు బాక్సాఫీసు బద్దలైపోవడం ఖాయం అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Nbnim3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...