Thursday, 2 January 2020

‘‘ఆ స్టార్ సింగరే మా అమ్మ.. నన్ను కని వదిలేసింది’’

‘సాయి దివ్య రూపం...’, ‘కదిలింది శ్రీసాయి పల్లకి..’ సాయినాథుడిని స్మరించాలంటే ఈ పాటలు చాలు. అంతగా లీనమై ఆలపించారు అలనాటి గాయని . తన గాత్రంతో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానుల మనసులు గెలుచుకున్న అనురాధ ప్రస్తుతం ఓ సమస్యలో చిక్కుకున్నారు. తాను అనురాధ కన్నబిడ్డను అంటూ కేరళకు చెందిన కర్మలా మోడెక్స్ అనే 45 ఏళ్ల మహిళ మీడియా ముందుకు వచ్చి షాకింగ్ ఆరోపణలు చేసింది. తనను కన్న నాలుగు రోజులకే కేరళకు చెందిన దంపతులకు ఇచ్చేసిందని కర్మల ఆరోపిస్తోంది. ‘‘అనురాధా పౌడ్వాలే నా కన్నతల్లి. నన్ను కన్న నాలుగు రోజులకే పొన్నచన్, ఆగ్నెస్ అనే దంపతులకు ఇచ్చేసింది. వారినే ఇన్నాళ్లూ నా తల్లిదండ్రులు అనుకున్నాను. ఇటీవల మా నాన్న పొన్నచన్ చనిపోయారు. ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందే అనురాధా పౌడ్వాల్ నా కన్న తల్లి అని చెప్పారు. తన కెరీర్‌కు అడ్డంకులు రాకుండా నన్ను చిన్నప్పుడే వదిలించుకుందని తెలిపారు. మొదట నేను సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకున్నాను. ఎన్నోసార్లు అనురాధను కలవాలని అనుకున్నాను. కానీ ఆమె కలిసేందుకు ఒప్పుకోలేదు. అందుకే నేను లీగల్‌గా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను" READ ALSO: " ఇన్నాళ్లూ నన్ను దూరం పెట్టినందుకు అనురాధ నాకు 50 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలి. నేను కోర్టులో పిటిషన్ వేయనున్నాను. నేను నా సొంత తల్లి దగ్గరే ఉండాలని అనుకుంటున్నాను’’ అని తెలిపారు. కర్మలకు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మరోపక్క అనురాధ 1991లో అరుణ్ పౌడ్వాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి సంతానం ఉన్నారు. కోర్టులో అనురాధతో పాటు ఆమె భర్త, పిల్లలు కూడా హాజరుకావాలని కర్మల డిమాండ్ చేస్తున్నారు. తానేమీ డబ్బు కోసమో పాపులారిటీ కోసమో ఈ ఆరోపణలు చేయడం లేదని కావాలంటే డీఎన్‌ఏ పరీక్షకు కూడా సిద్ధమేనని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అనురాధ నుంచి కానీ ఆమె కుటుంబం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZJ08bK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...