Thursday, 2 January 2020

`సరిలేరు నీకెవ్వరు` రిలీజ్‌ డేట్‌ కూడా మారనుందా..?

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ కూడా పూర్తి కావటంతో చిత్రయూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయితే సెన్సార్‌ పూర్తి అయిన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపింది. సరిలేరు నీకెవ్వరు సినిమాను ముందుగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అదే రోజు అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్‌ అవుతుండటంతో చర్చలు జరిపిన నిర్మాతలు సరిలేరు నీకెవ్వరు సినిమాను జనవరి 11న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. రిలీజ్‌ డేట్‌ కన్‌ఫార్మ్‌ చేస్తూ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. Also Read: అయితే తాజాగా సెన్సార్‌ పూర్తి అయిన సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో రిలీజ్‌ డేట్‌ ఇవ్వకుండా కేవలం సంక్రాంతి రిలీజ్‌ అని ఇవ్వటంతో ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో కూడా అనుమానాలు కలుగుతున్నాయి. అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో సినిమాను ముందుగా ప్రకటించినట్టుగా జనవరి 12న కాకుండా కాస్త ముందుకు జనవరి 10నే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో సరిలేరు నీకెవ్వరు టీం కూడా రిలీజ్ డేట్ విషయంలో పునరాలోచనలో ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రెండు భారీ చిత్రాలు ఒకే సమయంలో బరిలో దిగితే ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఇరు చిత్రాల నిర్మాతలు సామరస్యంతో సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. Also Read: మహేష్‌ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకుడు. సీనియర్‌ నటి విజయశాంతి చాలా కాలం తరువాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. దిల్‌ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QIztYm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...