Wednesday, 8 January 2020

‘డాంగ్ డాంగ్’ సాంగ్ మేకింగ్.. మహేష్‌ను బాగా కష్టపెట్టారు!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తోన్న క్రేజీ కమర్షియల్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమన్నా ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ సినిమాలోని డాంగ్ డాంగ్ అనే పాటలో తమన్నా నర్తించిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పటికే జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. దేవీశ్రీ ప్రసాద్ తన మార్క్ బీట్‌తో సంగీత ప్రేమికులని అలరించారు. అయితే, ఈ పాటలో మహేష్ బాబు కూడా తన డ్యాన్స్‌తో అలరించనున్నారని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. తమన్నాతో పోటీగా మహేష్ డ్యాన్స్ చేశారని చెప్పారు. నిజంగానే ఈ పాటలో మహేష్ బాగా కష్టపడ్డారు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన ‘డాంగ్ డాంగ్’ సాంగ్ మేకింగ్ వీడియో చెబుతోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో మహేష్ డ్యాన్స్‌ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటుంది. ఆర్మీ జవాన్లతో కలిసి తమన్నా డ్యాన్స్ చేయడం.. ఆ సెట్.. పిక్చరైజేషన్ అంతా కొత్తగా ఉంది. Also Read: ఈ మేకింగ్ వీడియోలో తమన్నా, అనిల్ రావిపూడి మాట్లాడారు. ఈ పాట చిత్రీకరణలో తన ఎక్స్‌పీరియన్స్‌ను చెప్పుకొచ్చారు తమన్నా. ఇప్పటి వరకు ఏ పాటలోనూ తాను ఆర్మీ లుక్‌లో కనిపించలేదని తమన్నా చెప్పారు. డాంగ్ డాంగ్ సాంగ్ కచ్చితంగా మరో పదేళ్లు పార్టీ సాంగ్‌లా ఉండిపోతుందని అన్నారు. మహేష్ బాబుతో డ్యాన్స్ చేసి ఐదేళ్లు అయిపోతుందని, ఈ పాటతో మళ్లీ ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అనిల్ రావిపూడితో అన్నారు. తమన్నా ఆర్మీ వాళ్లతో డ్యాన్స్ చేయడం ఏంటి, అలా జరుగుతుందా అని చాలా మందిలో అనుమానాలు ఉన్నాయని.. కానీ, ఆర్మీ వాళ్లతో చాలా సార్లు చాలా మంది సెలబ్రిటీలు వెళ్లి ఇంటరాక్ట్ అయ్యారని, ఆ కాన్సెప్ట్ తనకు నచ్చి ఈ పాటను పెట్టానని అనిల్ రావిపూడి వివరించారు. ప్రియాంక చోప్రా లాంటి చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు వెళ్లారని గుర్తు చేశారు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో గతంలో తాను పనిచేశానని.. కానీ, ఈ పాటలో చాలా కొత్తగా చూపించారని తమన్నా చెప్పారు. మహేష్, తను ఈ పాటలో చాలా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తామని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FyIbTK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...