Thursday, 16 January 2020

తిరుమలలో ‘సరిలేరు నీకెవ్వరు’.. స్వామివారిని దర్శించుకున్న మహేష్

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఘనవిజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ మొక్కులు తీర్చుకోవడానికి తిరుమల వెళ్లింది. గురువారం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు విమానంలో వెళ్లిన చిత్ర యూనిట్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వీరికి స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి వీరు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మహేశ్ బాబు, నమ్రత దంపతులతో పాటు వారి పిల్లలు గౌతమ్, సితార, సీనియర్ నటి విజయశాంతి, రాజేంద్రప్రసాద్, వంశీ పైడిపల్లి, దర్శకుడు అనిల్ రావిపూడి, ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు, మెహర్ రమేష్ ఉన్నారు. కాగా, సంక్రాంతి కానుకగా ఈనెల 11న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసేసింది. డిస్ట్రిబ్యూటర్ల షేర్ కూడా రూ.70 కోట్ల పైమాటే. ఇప్పటికే 90 శాతం పెట్టుబడిని ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. ఇదే ఊపు ఇంకొన్ని రోజులు కొనసాగితే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంటే. See Photo Story:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/373G4n5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...