Thursday, 16 January 2020

పోర్న్ ఇండస్ట్రీలోకి రావాలంటూ బ్రిటన్ రాకుమారికి ఆఫర్

ప్రముఖ హాలీవుడ్ నటి, డచెస్ ఆఫ్ ససెక్స్ మేగన్ మార్కెల్‌కు ఓ పోర్న్ వెబ్‌సైట్ నుంచి ఆఫర్ వచ్చింది. ‘యూ పోర్న్’ అనే వెబ్‌సైట్ నిర్వాహకులు తమతో చేతులు కలపాల్సిందిగా సదరు వెబ్‌సైట్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న చార్లీ హ్యూగ్స్‌ మేగన్‌కు లేఖ రాసి పంపారట. ఫండ్స్ సేకరించేందుకు ఆమెను వెబ్‌సైట్ డైరెక్టర్‌గా నియమించాలని అనుకుంటున్నట్లు లేఖ‌లో పేర్కొన్నారని ఫీమేల్ ఫస్ట్ కో యూకే సంస్థ వెల్లడించింది. ‘రాయల్ ప్యాలెస్ బయట సొంతంగా గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. మీరున్న స్థాయిలో ఎన్నో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కానీ మా ‘యూ పోర్న్’ సంస్థలో మిమ్మల్ని డైరెక్టర్ ఆఫ్ స్పెషల్ ఇనీషియేటివ్స్‌గా అపాయింట్ చేయాలని అనుకుంటున్నాం’ అని లేఖ‌లో పేర్కొన్నారు. ‘యూ పోర్న్’ వెబ్‌సైట్‌కు ఎవరూ ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. తన స్థాయికి తగ్గ అవకాశాలు మేగన్ మార్కెల్‌కు లభించకపోవడంతో ‘యూ పోర్న్’ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందట. రాజకుటుంబానికి చెందిన మేగన్ మార్కెల్‌కు ఇలాంటి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన వారికి ఎలా వచ్చిందో తెలీదు కానీ ఆమె అంగీకారం ఏంటో తెలుసుకోకుండానే సంస్థ తరఫున చేయాల్సిన పనులను లేఖ‌లో వివరించేశారు. READ ALSO: అయితే ఈ విషయం తెలిసి బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆగ్రహంగా ఉన్నారట. రాజకుటుంబానికి మచ్చ తెచ్చే పనులు చేస్తే ఊరుకోనని ఆమె నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు పలు ఆంగ్ల మీడియా వర్గాలు వెల్లడించాయి. బ్రిటన్ రాకుమారుడు హ్యారీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మేగన్ మార్కె్ల్. హాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన మేగన్‌కు హ్యారీ కంటే ముందు మరో వ్యక్తితో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అతనితో విడిపోయారు. ఆ తర్వాత హ్యారీని ఇష్టపడి రాజకుటుంబానికి కోడలు అయిపోయారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FZz6nu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...