Thursday, 9 January 2020

మీరు అనుమతిస్తేనే పిల్లల్ని కంటా: స్టార్ హీరోయిన్ దిమ్మ తిరిగే ఆన్సర్

సినీ ప్రముఖులు ప్రొఫెషనల్ విషయాలే కాదు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉండాలి. అప్పుడే జనాలకు మరింత దగ్గరవుతారు. అయితే కొందరు తమ కుటుంబం గురించి కానీ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎలాంటి విషయాలు బయటపెట్టడానికి ఇష్టపడరు. అయితే ఒక్కోసారి మీడియా వర్గాలు బలవంతపెడుతుంటాయి. ఈ పరిస్థితి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె‌కి కూడా ఎదురైంది. ఒకసారి రెండు సార్లు అయితే ఫర్వాలేదు. దీపిక ఎక్కడికి వెళ్లినా పిల్లల గురించి అడుగుతూనే ఉన్నారు. దాంతో దీపికకు ఒళ్లుమండింది. వారిపై ఆగ్రహం వ్యక్తం చేయలేక వ్యంగ్యంగా ఆన్సర్ ఇచ్చారు. ‘‘నేను గర్భం దాల్చినట్లు కనిపిస్తున్నానా? నేను పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నప్పుడు మీకు చెప్తాను. మీరు అనుమతి ఇస్తేనే పిల్లల్ని కంటాను. ఇప్పటికే నేను గర్భం దాల్చినట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. కానీ నేనెప్పుడూ వాటి గురించి చదివి సర్‌ప్రైజ్ అవ్వలేదు. పిల్లల్ని కనాలని నాకూ ఉంది. నాకు, మా వారు రణ్‌వీర్ సింగ్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. అలాగని ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ట్ చేసే ఆలోచన లేదు. మేమిద్దరం ఇప్పుడు కేవలం కెరీర్‌పైనే ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాం. ఇప్పుడు పిల్లల్ని కంటే కెరీర్‌పై ఫోకస్ చేయలేక వారిని పట్టించుకోలేక సతమతమవ్వాల్సి వస్తుంది. ఇప్పటికైతే మేం పిల్లల గురించి ఆలోచించడంలేదు. కాబట్టి ఈ ప్రశ్నలకు ఇక బ్రేక్ వేయండి’’ అని తెలిపారు. READ ALSO: గతంలో బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసుకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓసారి ఆమె తన భర్తతో కలిసి కారులో వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసేసి బిపాసా తల్లి కాబోతోందని రాసేశారు. అది చూసి బిపాసాకు ఒళ్లుమండింది. ఒళ్లో బ్యాగ్ పెట్టుకుని కూర్చుంటే పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపించిందే తప్ప తాను గర్భం దాల్చలేదని నిర్మొహమాటంగా చెప్పేసింది. అనుష్క శర్మకు కూడా ఇలాంటి ప్రశ్నలు చాలానే ఎదురయ్యాయి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QEzg9J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...