కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటి ప్రేమ కథ వైరల్‌గా మారింది. విజయలక్ష్మి అనే యువతి హీరోయిన్ ఫ్రెండ్‌గా, హీరోకి చెల్లిగా వివిధ పాత్రల్లో నటిస్తూ ఉండేది. ప్రస్తుతం ఆమె ‘తుంగభద్ర’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు ఆంజనేయ అనే వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్ సమయంలో ఆంజనేయకు విజయ లక్ష్మికి మధ్య చనువు పెరిగింది. ఆ చనువు కాస్తా ప్రేమగా మారింది. దాంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఇందుకు వారు ఒప్పుకోలేదు. దాంతో విజయ లక్ష్మి, ఆంజనేయ రహస్యంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. దాంతో విజయ లక్ష్మి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. పైగా విజయ లక్ష్మి నిర్మాతల నుంచి డబ్బులు తీసుకుని షూటింగ్‌లకు రావడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలీడంతో విజయ లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, తాను ఏ నిర్మాత నుంచి డబ్బులు తీసుకోలేదని తెలిపింది. READ ALSO: తాను ఆంజనేయను ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని పేర్కొంది. తన తల్లిదండ్రులు తనను దత్తత తీసుకున్నారని, పెళ్లి చేసుకుంటానని చెప్తే చావగొట్టి హింసించారని తెలిపింది. వారు తన భర్తను చంపాలని చూస్తున్నారని పేర్కొంది. తనకు తన భర్తకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QGlSCa
v
No comments:
Post a Comment