Saturday, 11 January 2020

విడాకులు ఎప్పుడు అని అడుగుతున్నారు: నటి ఆవేదన

ప్రముఖ మలయాళ నటి, యాంకర్ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. కేరళకు చెందిన వ్యాపారవేత్త విష్ణును మీరా పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని మీరా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. అయితే శుభవార్త చెప్పినందుకు మీరాకు శుభాకాంక్షలు చెప్పాల్సిందిపోయి చాలా మంది విడాకులు ఎప్పుడు అని అడుగుతున్నారట. ఈ విషయాన్ని మీడియా ముందు వెల్లడిస్తూ మీర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. READ ALSO: ‘‘నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇటీవల మా నిశ్చితార్థం అయింది. నా పుట్టినరోజు నాడు నేను విష్ణుని చూశాను. చూడగానే ప్రేమలో పడిపోయాను. అప్పుడే నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌పై నమ్మకం కలిగింది. విష్ణుని చూడగానే తను నావాడు అనిపించింది. అతన్ని వెంటనే కౌగిలించుకుని నా దగ్గరకు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేశావ్ అని అడగాలనిపించింది. కాబట్టి పెళ్లి విషయం మీ పెద్దలకే అప్పగించండి. పెద్దలు కుదిర్చిన పెళ్లిపై నమ్మకం ఉంచండి. కానీ కొన్ని కామెంట్స్ నన్ను ఇబ్బందిపెడుతున్నాయి. కొందరు నెటిజన్స్ విడాకులు ఎప్పుడు అని అడుగుతున్నారు. కానీ ఎందుకు? పెళ్లి చేసుకునేది విడాకులు తీసుకోవడానికి కాదు కదా. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకునేది జీవితాంతం కలిసి బతకడానికి. ఇలాంటి కామెంట్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఏదేమైనా పెళ్లి తర్వాత కూడా నేను నటించాలని అనుకుంటున్నాను’ అని వెల్లడించారు. READ ALSO: జూన్ 5న మీరా, విష్ణుల పెళ్లి ఘనంగా జరగనుంది. నెటిజన్ల నుంచి ఇలాంటి కామెంట్స్ రావడానికి కారణం లేకపోలేదు. ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. దాంతో సినీ ప్రముఖుల పెళ్లిళ్లు ఎంతో కాలం నిలవవు అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా విడిపోతున్న ఈ రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎంత కాలం నిలుస్తుంది అన్న అభిప్రాయంతో ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TcWs0A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...