నందమూరి నట వారసుడిగా సిల్వర్ స్క్రీర్ ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కోసం కష్టపడుతున్న యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ జానర్‌కు భిన్నంగా డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటున్న ఈ హీరో, స్వయంగా తానే నిర్మాతగా మారి తన అభిరుచి తగ్గ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇలా కళ్యాణ్ రామ్ చేసిన ప్రయోగాల్లో ఎక్కువ శాతం బెడిసికొట్టాయి. తాజాగా తన ఇమేజ్, స్టైల్‌కు భిన్నంగా ఓ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడావురా సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు`, అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` లాంటి భారీ చిత్రాలు పోటిలో ఉన్న తన మార్కెట్ తనదే అంటూ సినిమాను రిలీజ్ చేశాడు. Also Read: అయితే మరోసారి ఆడియన్స్ పల్స్ పట్టుకోవటంలో ఫెయిల్ అయ్యాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోగా భారీ పోటి మధ్య సినిమాను రిలీజ్ చేయటంతో వసూళ్లు కూడా పెద్దగా రాలేదు. దీంతో కూడా ఈ నందమూరి హీరోకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ సినిమా రిజల్ట్ కళ్యాణ్ రామ్‌లో చాలా మార్పు తెచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తన దగ్గరకు కథలతో వస్తున్న దర్శకులకు ప్రయోగాలు అయితే చేయనని తెగేసి చెప్పేస్తున్నాడట కళ్యాణ్ రామ్. పక్కా కమర్షియల్ ఫార్ములా కథ అయితేనే చేద్దామని ముందే కండిషన్ పెడుతున్నాడట. మాస్ యాక్షన్ సినిమా చేసి తిరిగి అభిమానులను అలరించే ప్లాన్‌లో ఉన్నాడు కళ్యాణ్ రామ్. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RmRj4C
v
No comments:
Post a Comment