Friday, 24 January 2020

కత్రినా కైఫ్ పెళ్లి.. నాగార్జున, అమితాబ్ సందడి

సినీ తారల వివాహం అంటే హడావుడి మామూలుగా ఉండదు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరవుతారు. గానాబజానాతో మోత మోగిస్తారు. అందులోనూ బాలీవుడ్ స్టార్ల వివాహాలైతే ఆ సందడి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన అవసరంలేదు. ఇలాంటి వివాహ వేడుకల్లో మన సౌత్ హీరోలు బాలీవుడ్ తారలతో కలిసిపోయి సందడి చేస్తే అది మరీ ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి సందర్భమే ఇది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లిలో మన సౌత్ స్టార్స్ నాగార్జున, ప్రభు, శివ రాజ్‌కుమార్ సందడి చేశారు. ఇదే వేడుకలో వీళ్ల ముగ్గురిని అమితాబ్ బచ్చన్ దంపతులు కలిశారు. ఇక ఫ్రేమ్ అదిరిపోతుంది కదా. అందుకే వారితో దిగిన ఫొటోను అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే, ఇది కత్రినా కైఫ్ రియల్ మ్యారేజ్ కాదు.. రీల్ మ్యారేజ్. కళ్యాణ్ జ్యూయెలర్స్‌ సంస్థ తాజాగా ఒక ప్రచార వీడియోను షూట్ చేసింది. ఈ షూట్‌లో తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్లు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, కత్రినా కైఫ్, అక్కినేని నాగార్జున, ప్రభు, శివ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ వీడియో ఒక పెళ్లి వేడుక. పెళ్లికూతురుగా కత్రినా కైఫ్ నటించారు. ఆమె తల్లిదండ్రులుగా అమితాబ్, జయ నటించారు. నాగార్జున, ప్రభు, శివ రాజ్‌కుమార్ అతిథులుగా కనిపిస్తారు. Also Read: ముగ్గురు సౌత్ స్టార్లను ఒకేసారి కలుసుకోవడం పట్ల అమితాబ్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేశారు. వారితో తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో పెట్టి తనకు, జయకు ఇదొక చారిత్రాత్మక క్షణం అని పేర్కొన్నారు. ‘‘జయకు, నాకు ఇదొక చారిత్రాత్మక క్షణం. భారత సినీ పరిశ్రమలో ముగ్గురు దిగ్గజాల కుమారులు అయిన ముగ్గురు సూపర్ స్టార్లు మాతో కలిసి పనిచేశారు. ఇది గొప్ప గౌరవం. నాగార్జున - అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు (తెలుగు) శివ రాజ్‌కుమార్ - డాక్టర్ రాజ్‌కుమార్ కుమారుడు (కన్నడ) ప్రభు - శివాజీ గణేశన్ (తమిళ్) కుమారుడు’’ అని అమితాబ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది పేరుకి కమర్షియల్ యాడ్ షూట్ అయినప్పటికీ ఏదో నిజంగా కత్రినా కైఫ్ పెళ్లి జరిగినట్టుగానే అనిపిస్తోంది. ఫొటోలు అంత అందంగా ఉన్నాయి మరి. అందరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. అమితాబ్, జయ డ్యాన్సులు చేశారు. కత్రినా కైఫ్ బంగారు ఆభరణాలు ధరించి పెళ్లికూతురి మేకప్‌లో మెరిసిపోతోంది. మొత్తం మీద ఈ యాడ్ షూట్ వాళ్లందరికీ ఒక అందమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37pZLFX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...