‘’ చిత్రంలో బాక్సాఫీస్ లెక్కల్ని సరిచేస్తున్నారు సూపర్ స్టార్ . సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డుల వేటలో.. ‘రమణా.. బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టాలరా’ అంటూ కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.7 కోట్ల షేర్ వసూలు చేసి కెరియర్ బెస్ట్ ఓపినింగ్స్ రాబట్టిన మహేష్ బాబు.. సంక్రాంతి సెలవుల్ని ఫుల్ క్యాష్ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ కా బాప్.. అంటూ తొలి వారంలో 100 కోట్లు షేర్ రాబట్టి సంక్రాంతి మొగుడు అనిపించుకున్నారు మహేష్ బాబు. ‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్లు శతక్కొట్టడంతో బ్లాక్ బస్టర్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో అనీల్ సుంకర నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకపాత్ర పోషించి టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Tzbuhx
v
No comments:
Post a Comment