స్టార్ క్రికెటర్ అభిమానులకు అదిరిపోయే న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. పాండ్య ఎప్పుడెప్పుడు ఓ ఇంటివాడు అవుతాడా అని తెగ ఎదురుచూసిన ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తూ బాలీవుడ్ నటి నటాషా స్టాన్‌కోవిచ్‌ను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎప్పటినుంచో వీరిద్దరి గురించి రూమర్స్ వస్తున్నా కూడా పాండ్య స్పందించలేదు. న్యూ ఇయర్‌కు మించిన సందర్భం ఉండదని భావించి అదే రోజున తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. ఈ సందర్భంగా నటాషా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. నటాషా సర్బియాకు చెందిన నటి. ‘డీజే వాలే బాబు’ అనే పాటలో నటించి ఇండియాలో బాగా పాపులర్ అయింది. * బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నటించిన ‘ది బాడీ’ సినిమాలో ‘ఝలక్ దిఖ్‌లాజా’ అనే ఐటెం సాంగ్‌లో ఆడిపాడింది. 2019లో ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో ‘నచ్ బలియే’లో తన మాజీ ప్రియుడు అలీ గోనీతో కలిసి పాల్గొంది. ఇందులో వీరిద్దరూ మూడో రన్నరప్స్‌గా నిలిచారు. READ ALSO: * ‘నచ్ బలియే’ షోలో పాల్గొన్న సమయంలో నటాషా డ్యాన్స్ చేస్తూ మధ్యలో స్టెప్స్ మర్చిపోయింది. దాంతో తన మీద తనకే కోపం వచ్చి సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఈ షోకు జడ్జిలుగా అహ్మద్ ఖాన్, రవీనా టాండన్‌లు ఉన్నారు. తమ అభిప్రాయాలు కూడా అడగకుండా నటాషా అలా వెళ్లిపోవడం వారికి నచ్చలేదు. * షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీరో’ సినిమాలో నటాషా ప్రముఖ నటుడు అభయ్ డియోల్ ప్రేయసి పాత్రలో నటించింది. READ ALSO: *‘సత్యాగ్రహ’, ‘ఫక్రే రిటర్న్స్’, ‘డ్యాడీ’ సినిమాల్లో నటాషా ఐటెం సాంగ్స్‌లో ఆడిపాడింది. *ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో నటాషా పాల్గొంది. కానీ 28వ రోజే షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2u37sTF
v
No comments:
Post a Comment