Wednesday, 1 January 2020

ఈసారి హగ్ కాదు ఏకంగా ముద్దే.. హాట్ భామ 2020 సెల్ఫీ

బాలీవుడ్ నటుడు అర్జున్‌ కపూర్‌కి, డ్యాన్సర్ మలైకా అరోరాకి 2019 బాగా కలిసొచ్చింది. అదే ఏడాదిలో వారిద్దరూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించేశారు. అయితే 2020 తొలిరోజున మాత్రం ఇంకాస్త ఘాటుగా తామిద్దరం ప్రేమలో ఉన్నామని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మలైకా, అర్జున్ ఓ పార్టీలో తెగ ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో మలైకా అర్జున్ బుగ్గపై ముద్దుపెడుతూ ఫొటో దిగారు. ఆ ఫొటోను మలైకా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు బెస్ట్ న్యూ ఇయర్ కానుకను ఇచ్చారు. 2020లో వీరిద్దరూ దిగిన తొలి సెల్ఫీ ఇదే. అయితే ఈసారి మలైకా వేడుకలకు విదేశాలకు వెళ్లలేదు. తన ప్రియుడు అర్జున్‌తో కలిసి గోవా వెళ్లింది. ఇంకొన్ని రోజుల పాటు వీరిద్దరూ అక్కడే ఉండబోతున్నారట. అయితే ఎప్పుడైనా తామిద్దరం ప్రేమలో ఉన్నామని అర్జున్, మలైకా చెప్పారో పెళ్లి గురించి తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తొలుత వీరిద్దరూ జూన్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని మలైకా తెలిపారు. READ ALSO: అయితే 2020లో మాత్రం పక్కా పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ పెళ్లంటూ జరిగితే మాత్రం బీచ్ వెడ్డింగే చేసుకుంటానని మలైకా గతంలో వెల్లడించింది. మరోపక్క మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తన ప్రేయసి జార్జియా ఆండ్రియానితో కలిసి ఎంజాయ్ చేశారు. 2020లో వీరు కూడా పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SQOp9L
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...