ఒకప్పుడు వరుస హిట్స్‌తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. రాజేంద్ర ప్రసాద్ తరువాత ఆ తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వరుస విజయాలతో ఆకట్టుకున్నాడు. జెట్ స్పీడుతో 50 సినిమాలు పూర్తి చేసిన ఈ యంగ్ హీరో తరువాత ఒక్కసారిగా కెరీర్‌లో వెనకపడ్డాడు. మూస కథలు రొటీన్ కామెడీ సినిమాలు ఆడియన్స్‌కు బోర్ కొట్టడంతో నరేష్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. సుడిగాడు సినిమా తరువాత ఈ యంగ్ హీరోకు సాలిడ్ హిట్ ఒక్కటి కూడా దక్కలేదు. దీంతో కాస్త స్లో అయిన నరేష్ డిఫరెంట్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల మహర్షి సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా మరో డిఫరెంట్ మూవీకి రెడీ అవుతున్నాడు అల్లరి నరేష్. అయితే ఈ సినిమాలో పూర్తిగా యాక్షన్ రోల్‌లో కనిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. Also Read: సినిమా ప్రారంభోత్సవ ఆహ్వానం అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నరేష్ ఈ సినిమా తరువాత దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేయనున్నాడు. సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానున్న ఈ సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకల సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడించనున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FZZ7CS
v
No comments:
Post a Comment