Sunday, 19 January 2020

టాలీవుడ్ పట్టించుకోలేదు.. తెలుగమ్మాయికి బాలీవుడ్ పిలుపు

తెలుగు అమ్మాయిలను టాలీవుడ్ పట్టించుకోదు అన్నది ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న మాట. ఒకప్పుడు తెలుగు హీరోయిన్లకే అవకాశాలు వచ్చేవి. కానీ కాలం మారుతున్న కొద్ది తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వారిని హీరోయిన్లుగా తీసుకుంటున్నారు కానీ తెలుగు అమ్మాయిలను అంతగా పట్టించుకోవడంలేదు అన్న మాటలో కాస్తో కూస్తో నిజం ఉందని కొందరి అభిప్రాయం. ఇందుకు ఉదాహరణ ఈషా రెబ్బానే. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ భామకు సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. 2013లో వచ్చిన ‘అంతకుముందు ఆ తర్వాత’ అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. అయితే ఈషాకు సరైన బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంతవరకు పడలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’లో హీరోయిన్ పూజా హెగ్డేకు సోదరి పాత్రలో నటించారు. కానీ ఇందులో ఈషా పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. దాంతో ఈ సినిమా కూడా ఈషా కెరీర్‌కు పెద్దగా కలిసిరాలేదు. దాంతో ఆమె తమిళం, కన్నడ సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ను ముందుకు నెట్టుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఈషాకు ఏకంగా బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. READ ALSO: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సోదరుడైన హర్షవర్ధన్ కపూర్‌కు జోడీగా ఓ సినిమాలో నటించబోతున్నారట. ఈ మేరకు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘అంతద్వంద్’ అనే సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న నటుడు, స్క్రీన్ రైటర్ రాజ్ సింగ్ చౌదరి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట. అయితే ఈషా నుంచి ఈ చర్చపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. ఇందులో ఈషా రాజస్థానీ అమ్మాయిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/368K3xu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...