Thursday, 16 January 2020

`ఎమ్జీఆర్‌` లుక్‌లో కనిపిస్తున్న ఈ నటుడిని గుర్తుపట్టారా?

ప్రస్తుతం సౌత్‌ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. క్రీడాకారులు, సినీ నటులతో పాటు రాజకీయ నాయకుల జీవితాలను కూడా వెండితెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఓ తమిళ నటి, రాజకీయ నాయకురాలు చేరనున్నారు. గ్లామర్‌ రంగం నుంచి తమిళ రాజకీయ అరంగేట్రం చేసిన దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్‌ రూపొందుతోంది. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ ఇస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి స్టార్ హీరో ఎంజీ రామచంద్రన్‌ 103వ జయంతి సందర్భంగా సినిమాలోని పాత్రను రివీల్ చేశారు. ఈ పాత్రను విలక్షణ నటుడు పోషిస్తున్నారు. తమిళ సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఎమ్జీఆర్‌కు ఇది సరైన నివాళి అంటున్నారు చిత్రయూనిట్‌. Also Read: ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ.. `తలైవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నాకు దక్కటం నిజంగా నా అదృష్టం. తమిళనాడును ఎంతో అభివృద్ది చేసిన గొప్ప వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. అదే సమయంలో ఆ పాత్రలకు సరైన నటులను ఎంచుకోవటం ఓ చాలెంజ్‌గా మారింది. జయలలిత పాత్రకు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను తీసుకున్న తరువాత మరో ప్రధాన పాత్ర అయిన ఎమ్జీఆర్‌ రోల్ కోసం చాలా మంది నటుల గురించి ఆలోచించాం. చివరకు అరవింద్‌ స్వామి అయితే ఆ లుక్‌లో పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారని ఆయన్ను ఫిక్స్ చేశాం. భారతరత్న గౌరవం పొందిన ఒకే ఒక్కనటుడైన ఎమ్జీఆర్‌ను ఆరాధించే వారు ఇప్పటికీ కోట్ల సంఖ్యలో ఉన్నారు. అందుకే ఆయన పాత్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. Also Read: ఎన్టీఆర్‌ బయోపిక్‌లను నిర్మించిన విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన జూన్‌ 26న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35XZxEn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...