Friday, 24 January 2020

ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో `అశ్వథ్థామ` హవా

హీరోగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్న యంగ్ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం . ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 31న రిలీజ్‌ అవుతోంది. ఇన్నాళ్లు పెద్దగా హడావిడి లేకపోయినా ఒక్క ట్రైలర్‌తోనే హాట్ టాపిక్‌గా మారిపోయాడు అశ్వథ్థామ. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ హవా చూపిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా వరల్డ్ థియేట్రికల్‌ రైట్స్‌ దాదాపు 10 కోట్లకు అమ్ముడైనట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. శాటిలైట్‌, డిజిటల్‌, ఆడియో హక్కులు కలుపుకొని నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ మరో 6 కోట్ల 20 లక్షలు వరకు పలికాయి. దీంతో నిర్మాతలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే సినిమా సక్సెస్‌ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్న చిత్రయూనిట్ బిజినెస్‌ కూడా ఫుల్‌ సింగ్‌లో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. Also Read: నాగశౌర్య స్వయంగా కథ అందించిన ఈ సినిమాకు రమణ తేజ దర్శకుడు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ప్రామిసింగ్‌గా ఉంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే మూడు మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది అశ్వథ్థామ ట్రైలర్‌. నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ నాగశౌర్య కెరీర్‌కు కూడా కీలకం కావటంతో ప్రమోషన్‌, రిలీజ్‌ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RJhBxe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...