Sunday, 12 January 2020

సరిలేరు నీకెవ్వరు రెండో రోజు కలెక్షన్స్: తగ్గేది లేదమ్మా అంటున్న మహేష్

సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మహేష్‌కు మర్చిపోలేని విజయాన్ని తెచ్చిపెట్టింది. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ తర్వాత మహే‌ష్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందు నుంచీ అందరూ ఊహిస్తూనే ఉన్నారు కానీ ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా వసూళ్లు రాబడతాయని ఎవ్వరూ ఊహించలేదు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.47 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజైతే అస్సలు ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్లు వసూళ్లతో దూసుకెళ్తోంది. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 63 నుంచి 65 కోట్ల వరకు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుల చెబుతున్నారు. ఇక మూడో రోజునే సినిమా వంద కోట్లు దాటేలా ఉందని అంటున్నారు. మహేష్ తన కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టారు. గతంలో ‘మహర్షి’ సినిమా తొలిరోజు రూ. 24.68 కోట్లు రాబట్టింది. ఆ రికార్డును ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ బ్రేక్ చేసింది. అయితే, తెలుగులో ఓవరాల్‌గా చూసుకుంటే తొలిరోజు కలెక్షన్ల రికార్డులో ‘సరిలేరు నీకెవ్వరు’ నాలుగో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ‘బాహుబలి 2’ (రూ. 43 కోట్లు) ఉంది. READ ALSO: ఆ తరవాత ‘సాహో’ (రూ. 36.63 కోట్లు), ‘సైరా’ (రూ. 36.37 కోట్లు) ఉన్నాయి. ‘అజ్ఞాతవాసి’ని వెనక్కి నెట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ థియేట్రికల్ రైట్స్‌ను సుమారు రూ. 75 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. తొలిరోజే రూ.32 కోట్ల మేర షేర్ వసూలైపోయింది. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటించారు. లేడీ అమితాబ్ విజయశాంతి మహేష్‌కి సమానంగా కీలక పాత్రను పోషించారు. జగపతిబాబు, హరితేజ, సంగీత, రావు రమేష్ సహాయ పాత్రలను పోషించారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QO4uvb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...