జీవితంలో భాగస్వామిగా ఒక్కర్నే ఊహించుకోగలం. వారితో కలకాలం కలిసుండాలని కోరుకుంటాం. ఒకవేళ సమస్యలు వచ్చినా సరిదిద్దుకుపోవాలని అనుకుంటాం. మరీ కుదరకపోతే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకుంటాం. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రముఖ హాలీవుడ్ నటి మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదో పెళ్లి చేసుకున్నారు. అందులోనూ 52 ఏళ్ల వయసులో. 1995లో టామీ లీ అనే నటుడ్ని పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లకే అతనితో విడిపోయారు. ఆ తర్వాత కిడ్ రాక్ అనే మరో వ్యక్తిని పెళ్లాడారు. ఈ పెళ్లీ నిలవలేదు. మూడోసారి పోకర్ ప్లేయర్ రిక్ సాలోమన్‌ను వివాహం చేసుకున్నారు. ఇతనితో విడిపోయి మళ్లీ కలిసిపోయి మళ్లీ అతన్నే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ విడిపోయారు. ఇప్పుడు హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలీబూలో నిన్న వీరి వివాహం జరిగిందట. READ ALSO: ఇక్కడ మరో విషయం ఏంటంటే.. దాదాపు 36 ఏళ్లుగా పమేలా జాన్ పీటర్స్‌తో డేటింగ్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని పీటర్స్ ఓ సందర్భంలో మీడియా ముందు వెల్లడించారు. తన చుట్టూ ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉన్నప్పటికీ తనకు పమేలాతోనే జీవితాన్ని పంచుకోవాలని ఉండేదని తెలిపారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జాన్ పీటర్స్‌కి కూడా ఇది ఐదో పెళ్లే. అతని చివరి వివాహ బంధం 2014లో ముగిసింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన ‘బేవాచ్’ సినిమాలో పమేలా కీలక పాత్రలో నటించారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37jvQiF
v
No comments:
Post a Comment