Wednesday, 15 January 2020

పూజా హెగ్డే కోసం ముంబై వెళ్లిన తెలుగబ్బాయి.. 5 రోజులు రోడ్డుపైనే.. చివరికి!!

స్టార్ హీరోలకే కాదు.. హీరోయిన్లకూ వీరాభిమానులు ఉంటారు. వెండితెరపై తమకు ఇష్టమైన హీరోయిన్‌ను చూసి ఆనందపడతారు కొందరు. ఇక తమ గదిలో, మదిలో ఆ హీరోయిన్‌ ఫొటోను పెట్టుకుని ఆ అనుభూతిని ఆస్వాదిస్తుంటారు మరికొందరు. కానీ, ఆ హీరోయిన్ కోసం, ఆమెను కలవడం కోసం ఎంతకైనా తెగించేవారు కొందరే ఉంటారు. అలాంటి ఒక కుర్రాడి కథే ఇది. భాస్కర్ రావు అనే తెలుగు కుర్రాడు పూజా హెగ్డేకు వీరాభిమాని. ‘డీజే’ సినిమా నుంచి పూజా హెగ్డేను ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆమెను ఎలా అయినా కలవాలనుకున్నాడు. పూజా ముంబైలో ఉంటుందని తెలుసుకున్నాడు. నేరుగా అక్కడికే వెళ్లిపోయాడు. ఆమె ఎక్కడుంటుంది తెలుసుకున్నాడు. ఆమెను కలవడం కోసం 5 రోజులపాటు పడిగాపులు కాసాడు. ఫుట్‌పాత్‌పైనే 5 రోజులు పడుకున్నాడు. మొత్తానికి తన అభిమాని నటిని కలుసుకోగలిగాడు. ఆమెతో మాట్లాడాడు. ఆమె చేతిలో చేయి కలిపాడు. Also Read: తనను ఇంతగా ఆరాధించే అభిమానిని చూసి పూజా హెగ్డే ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు. అందుకే, ఈ విషయం గురించి అందరికీ చెప్పాలని తన అభిమానితో మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఈ వీడియోలో భాస్కర్ రావు తెలుగులోనే మాట్లాడాడు. ఐదు రోజులపాటు ఫుట్‌పాత్‌పైనే పడుకున్నానని చెప్పాడు. అతడి అభిమానానికి పూజా ఫిదా అయిపోయారు. ఇక వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని పూజా సూచించారు. ‘‘ఎంతో కష్టపడి ముంబై వచ్చి, నన్ను చూడటానికి ఐదు రోజులు పడిగాపులు కాసిన భాస్కర్ రావుకి కృతజ్ఞతలు. ఈ ఘటన నా హృదయాన్ని హత్తుకుంది. కానీ, నన్ను కలుసుకోవడానికి నా అభిమానులు ఇంతగా ఇబ్బందిపడితే నాకు చాలా బాధగా ఉంటుంది. నా కోసం వచ్చి మీరు రోడ్లపై పడుకుంటే నేను చూసి తట్టుకోలేను. మీరెక్కడున్నా మీ ప్రేమను నేను ఆస్వాదిస్తానని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీరే నా బలం. లవ్ యు ఆల్’’ అని తన పోస్ట్‌లో పూజా పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TwEIgG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...