Thursday, 26 December 2019

Shimla Mirchi Trailer: ఘాటు ఘాటు అందాలు ఆరబోసిన రకుల్ ప్రీత్ సింగ్

వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తున్నారు అగ్ర కథానాయిక . ఇటీవల ‘మర్జావా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రకుల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ సినిమాలకు సంతకం చేసేస్తున్నారు. ఇప్పటికే రకుల్ చేతిలో రెండు మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘షిమ్లా మిర్చి’ ఒకటి. ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో రాజ్‌కుమార్ రావు కథానాయకుడిగా నటించారు. హేమ మాలిని రకుల్ తల్లిగా కీలక పాత్ర పోషించారు. ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.. అవి (రాజ్‌కుమార్ రావు)కి నైనా (రకుల్) అంటే చాలా ఇష్టం. కానీ అవికి ఓ ప్రాబ్లమ్ ఉంది. ఎప్పుడు నైనాను చూసినా ఐ లవ్యూ అనే మాట చెప్పలేక ‘ఐ’ అన్న పదం దగ్గరే ఆగిపోతుంటాడు. దాంతో చెప్పే ధైర్యం లేకపోతే కనీసం లెటర్ అయినా రాసి పంపు అని ఫ్రెండ్ సలహా ఇస్తాడు. దాంతో అవీ లవ్ లెటర్ రాసి నైనా ఇంట్లో ఉన్న పోస్ట్ బాక్స్‌లో వేస్తాడు. అయితే అవి కర్మ కాలి ఆ లెటర్ నైనా తల్లి (హేమ మాలిని) కంట పడుతుంది. దాంతో భర్త లేని ఆమె అవీ తనని ప్రేమిస్తున్నాడనుకుని తాను కూడా అతన్ని ఇష్టపడుతుంది. READ ALSO: ఈ విషయం తెలిసి అవి, నైనా షాకవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అవీని నైనా పెళ్లి చేసుకుంటుందా? లేక ఆమె తల్లి పెళ్లి చేసుకుంటుందా? అన్నదే సినిమా కథ. సినిమా స్టోరీ చాలా ఫన్నీగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఇందులో రకుల్‌తో పాటు హేమ మాలిని కూడా హీరోయిన్‌ అనే చెప్పాలి. ఇక ట్రైలర్‌లో రకుల్ మిర్చిలా ఘాటు ఘాటు అందాలను ఆరబోసింది. చీరకట్టులో నిజంగా ‘షిమ్లా మిర్చి’ అనిపించుకుంది. రమేష్ సిప్పీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీని 2020 జనవరి 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rw4TJ3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...