Thursday, 26 December 2019

ఒకే మంచంపై.. ఆపై ముద్దులు: ఏంది సల్మాన్ ఇదీ!

సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ 13వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ లవర్స్‌ పార్క్‌లా తయారైందని చెప్పొచ్చు. ఒకప్పుడు కాట్ల కుక్కల్లా కొట్టుకున్న కంటెస్టెంట్లు ఇప్పుడు ముద్దులతో తెగ రొమాన్స్‌లు చేసుకుంటున్నారు. ఈ షోలో పాల్గొన్న బుల్లి తెర నటులు మధురిమా తులి, విశాల్ ఆదిత్య సింగ్ ఒకప్పుడు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా పాత గొడవలు మర్చిపోలేక ఇద్దరూ వారం రోజుల పాటు మాట్లాడుకోలేదు. పైగా అసహ్యంగా అందరి ముందు తిట్టుకున్నారు కూడా. ఇప్పుడు సీన్ మారింది. ఇద్దరి మధ్య ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఎంత కొట్టుకున్నా ఇద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్నారు కాబట్టి ఇద్దరూ దగ్గరైపోయారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ వీరిద్దరి తతంగం ఒకే బెడ్‌పై నిద్రపోయే వరకూ వచ్చింది. అంతేకాదు దుప్పట్లో దూరి మరీ ముద్దులు పెట్టుకుంటూ తెగ రొమాన్స్‌లు చేసుకుంటూ బిగ్ బాస్ కెమెరాలకు చిక్కారు. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఇదే విధంగా తనను సపోర్ట్ చేసి ఉంటే ఇలా విడిపోయేవాళ్లం కాదు కదా అంటూ తెగ కబుర్లు చెప్పుకున్నారు. READ ALSO: అయితే విశాల్, మధురిమ ప్రేమించి విడిపోయారని తెలుసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు వారిని కావాలనే హౌజ్‌లోకి పంపించారట. విడిపోయిన ప్రేమికుల మధ్య జరిగే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయని మధురిమకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించారు. అంతేకాదు షో కోసం ఇద్దరూ కలిసిపోవాలని చెప్పారట. అయితే బిగ్ బాస్ షోని లవర్స్ పార్క్‌లా మార్చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్లు అందరికీ వేరు వేరు పడకలు ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి ఒకే బెడ్‌పై పడుకుని ఆ రాసలీలలు ఏంటి అంటూ సల్మాన్ ఖాన్‌ను ఏకిపారేస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZxCoqT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...