Wednesday, 18 December 2019

Prathi Roju Pandage: తేజూకి డిగ్రీలో లవర్... బయటపెట్టిన అలీ

‘ప్రతిరోజూ పండగే’ అంటూ పండగపూట సందడి చేసేందుకు డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సుప్రీమ్ హీరో . దాసరి మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించగా సత్యరాజ్ హీరో సాయితేజ్‌కి తండ్రిగా నటించారు. గీతా ఆర్ట్స్‌లో బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతికి ముందే ప్రతిరోజూ పండగే అంటూ బాక్సాఫీర్ వార్‌‌కి దిగుతున్న సాయి తేజ్ తన కొత్త సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. దీనిలో భాగంలో ఈటీవీలో ప్రసారమ్యే కార్యక్రమానికి గెస్ట్‌గా వెళ్లారు సాయిధరమ్ తేజ్, మారుతిలు. ఆ ఎపిసోడ్‌‌కి సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తుంది. అలీ షో అంటే రచ్చ మాములుగా ఉండదు.. అలాంటిది సుప్రీమ్ హీరో తన షోకి రావడంతో అలీ తనదైన శైలిలో ఎక్కడెక్కడి విషయాలన్నీ బయటకు లాగే ప్రయత్నం చేశారు. సోలో బ్రతుకే సో బెటరూ అంటున్న సాయి ధరమ్ తేజ్ ప్రేమకథల గుట్టుని బయటపెట్టారు అలీ. తేజూకి డిగ్రీలో ఓ ప్రేమకథ ఉంది మీకు తెలుసా? అని మారుతిని అడుగారు అలీ. అవునా? తేజూకి లవ్ స్టోరీ ఉందా? నాకు తెలియదే! అని మారుతి అనడంతో.. ‘డిగ్రీలో ఏం జరిగిందో చెప్పు’ అని అలీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు అలీ. చెప్పు తేజూ అని మారుతీ కూడా అడగడంతో.. ‘చెప్పడానికి ఏం ఉంది అన్నా.. ఒకటి కాదు చాలా ఉన్నాయి’ అంటూ అసలు విషయం చెప్పి తెగ సిగ్గుపడిపోయాడు తేజూ. ఈ లవ్ ట్రాక్ నాకు తెలియదు సార్.. లేదంటే వాడేసేవాడిని అని మారుతి అనడంతో.. ‘నువ్ వాడేస్తావ్ అనే నీకు చెప్పలేదు’ అంటూ పంచ్ పేల్చుతూ తెగ నవ్వేశాడు తేజూ. మనోడి డిగ్రీ ప్రేమకథ ముచ్చట్లపై మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2S22fWh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...