నటసింహ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రూలర్’. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటించారు. డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణ పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్ గురించి మాట్లాడారు. ‘ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టాలన్న ఆలోచన బోయపాటి శ్రీనుదే. ఆయన నిర్మాత కళ్యాణ్‌తో మాట్లాడగానే టైటిల్ ఓకే చేశారు. రూలర్ అంటే కేవలం రాజే కాదు. ఒక పోలీసు అధికారి కూడా రూలరే. మొన్న తెలంగాణ పోలీసులు ఎంత అద్భుతమైన పని చేశారో చూశాం కదా. ఓ మహిళను అన్యాయంగా రేప్ చేసి చంపేస్తే పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌లో లేపిపారేశారు. పోలీసులు వారిని ఓ స్పాట్‌కు తీసుకెళితే రాళ్లు రువ్వి దౌర్జన్యం చేశారని ఎన్‌కౌంటర్ చేసి పారేశారు. పోలీసుల రూపంలో దేవుడే వారికి శిక్ష విధించాడు. చట్టం, న్యాయం అనుకుంటే కేసు సాగుతూనే ఉండేది. అది టైం తీసుకున్నా సరే పోలీసులు స్పాట్‌లో జడ్జిమెంట్ ఇచ్చారు. నేను నటించిన ‘సింహా’ సినిమాలో కూడా నయనతార ఇలాంటి డైలాగ్ చెబుతుంది. ‘ఆయన ఎన్‌కౌంటర్లు చేయడం ఎప్పుడో మొదలుపెట్టారు’ అని. ఇవాళ పోలీసులు చేసింది కూడా అదే. వారిని నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పోలీసు గెటప్‌కు రూలర్ అనే టైటిల్ మ్యాచ్ అయింది’ అని తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2S6I4Xc
v
No comments:
Post a Comment