ప్రముఖ కమెడియన్ తల్లి జైతున్ బీబీ గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైతున్ తన స్వస్థలంలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఖాతాలో ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. ‘‘అలీ తల్లి జైతున్ బీబీ గారు తుదిశ్వాస విడిచారని తెలిసి చాలా బాధపడ్డాను. బీబీ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి క్రితమే అలీ నివాసానికి వెళ్లారు. కన్నీరుమున్నీరు అవుతున్న అలీని పరామర్శించారు. బీబీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రాజకీయపరంగా అలీకి పవన్‌కి మధ్య విభేదాలు ఉన్న మాట అందరికీ తెలిసిందే. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలీ తన తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపించేవారు. ముఖ్యంగా తన తల్లి అంటే అలీకి పంచ ప్రాణాలు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తల్లిదండ్రులేనని అలీ చాలా సందర్భాల్లో చెప్పారు. షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా తన తల్లితో సమయం గడిపేందుకు ఇష్టపడేవారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rTh7M6
v
No comments:
Post a Comment